Page Loader
ప్రేరణ: నీలోని తెలివి, సామర్థ్యం కాలంతో పాటు పెరగాలంటే ఈరోజు నువ్వు పని మొదలెట్టాలి 
పనిలో సామర్థ్యం పెరగాలంటే పని చేయడం మొదలెట్టాలి

ప్రేరణ: నీలోని తెలివి, సామర్థ్యం కాలంతో పాటు పెరగాలంటే ఈరోజు నువ్వు పని మొదలెట్టాలి 

వ్రాసిన వారు Sriram Pranateja
May 05, 2023
07:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాలం ఎవ్వరికోసమూ ఆగదు. దాని పని అది చేసుకుంటూ పోతుంది. రోజులు మారిపోతూ ఉంటాయి. క్యాలెండర్లు మారిపోతూ ఉంటాయి. కాలంతో పాటు నువ్వు కూడా మారాలి. నీలోని తెలివి, సామర్థ్యం గతంలో కంటే ఇంకాస్త పెరగాలి. లేదంటే ఈ కాలానికి నువ్వు సెట్ కాకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాలానికి తగినట్టుగా మారాలంటే పనిచేస్తూ ఉండాలి. ఒక పని నువ్వు మొదలుపెట్టి చేస్తూ పోతుంటే ఆ పనిచేసే సామర్థ్యం నీలో పెరుగుతుంది. ఆ పనిని మరింత తెలివిగా ఎలా చేయాలో నీకు అర్థమవుతుంది. అలా కాకుండా పనే మొదలు పెట్టలేదనుకో, నీలోని తెలివి అక్కడే ఆగిపోతుంది. అందుకే ఏదైనా సాధించాలన్న సంకల్పం నీలో ఉంటే ఆ పనిని ఇప్పటి నుండే మొదలు పెట్టు.

Details

తెలివి పెరగాలంటే ఓపిక కావాలి 

పని మొదలెట్టిన ప్రారంభంలో ఎవ్వరైనా తప్పులు చేస్తారు. అలాంటప్పుడు పనిచేయడం మానేయకండి. గొప్ప పనులు చేయాలంటే ఓపిక కావాలి. ఓపిక మీలో ఉన్నప్పుడే మీ తెలివి మరింత పెరుగుతుంది. ఆ పనిమీద మీకు అధికారం వస్తుంది. అందులో ఆనందం దొరుకుతుంది. చాలామంది చేసే తప్పు ఇదే. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలని అనుకుంటారు. మొదట్లో బాగానే ఉంటారు. కానీ ఏవైనా పొరపాట్లు జరగ్గానే ఆ పనిచేయడం మానేస్తారు. మీరలా ఉండకండి. ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ ఎవ్వరూ ఉండరు. చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ఆ పని చేయడంలో వందశాతం ఎఫర్ట్ పెడితే విజయం ఖచ్చితంగా దక్కుతుంది. వీటన్నింటి కన్నా ముందు, ఒక పనిలో మీ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే ఆ పనిని మొదలెట్టండి.