ప్రేరణ: అవమానాలను గుర్తుంచుకుంటే కసి పెరుగుతుంది, వదిలేస్తే నువ్వు పెరుగుతావు
ఈ వార్తాకథనం ఏంటి
జీవితం అనేది ప్రకృతి లాంటిది. ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అప్పుడప్పుడూ విపరీతమైన గాలులు, భూకంపాలు, సునామీలు వస్తూనే ఉంటాయి. జీవితం కూడా అంతే.
జీవితంలో ఎన్నో రకాల అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. విజయాలు, ఓడిపోవడాలు, అడ్డంకులు, అవమానాలు.. ఇలా ఎన్నో వస్తుంటాయి. కొందరు అవమానాల దగ్గర ఆగిపోతారు.
ఇక్కడ అవమానం అంటే ఓటమి కూడా వస్తుంది. చాలామంది ఓటమిని తీసుకోకపోవడానికి కారణం, నలుగురూ నచ్చుతారనే. ఆ నవ్వును ఎలా తీసుకోవాలో తెలియకే అవమానంగా ఫీలవుతారు.
ఆ ఫీలింగ్ లోనే చాలారోజులు బతికేస్తారు. తమను అవమానించిన వారిని తిరిగి తాము అవమానించినట్టుగా ఆలోచిస్తూ సంతృప్తి పొందుతారు.
Details
ఎదుటివాడి ఆశ్చర్యం కన్నా నీ సంతోషం ముఖ్యం
పదే పదే అవమానం గురించి ఆలోచించడం వల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందేమో కానీ సొల్యూషన్ మాత్రం రాదు.
నిన్ను అవమానించిన వారి తలలు నేలకు దించాలంటే నువ్వు విజయం వైపు నడవాలి. అలా నడవాలంటే నువ్వు అవమానం అనే ఆలోచనలను వదిలేయాలి.
ఎవరికోసమో కాకుండా గెలుపు కోసం నువ్వు ప్రయత్నించినపుడు ఆ గెలుపు నీకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం కోసమే పనిచేయాలి.
నీ ఎదుగుదలను చూసి ఎదుటివాడు ఆశ్చర్యపోతే నీకొచ్చే సంతోషం, వాడు నీ ఎదురుగా ఉన్నంత సేపే ఉంటుంది. అదే నీ కష్టంతో, కృషితో గెలిచావన్న సంతోషం, నీతో ఎప్పడికీ ఉంటుంది.