
ప్రేరణ: ప్రతీసారి పట్టుకోవడమే కాదు అప్పుడప్పుడు వదిలేయడమూ తెలిస్తేనే ఆనందం
ఈ వార్తాకథనం ఏంటి
ఒక పని నెరవేరాలంటే పట్టుదల ఉండాలి. నిజమే, కానీ ఎంతకాలం అనేది ప్రశ్న. ప్రతీసారి పట్టుకుంటేనే కాదు వదిలేస్తే కూడా విజయం దక్కుతుంది.
విజయం కంటే ముఖ్యంగా ఆనందం దక్కుతుంది. గమ్యం వైపు చేరాలని ఎన్నో ఏళ్ళుగా శ్రమిస్తున్నావు. గమ్యం వైపు నువ్వు చేసే ప్రయాణంలో నీకు ఆనందం లభించడం లేదనుకో, అప్పుడు నువ్వు గమ్యం చేరుకున్నా పెద్ద హ్యాపీగా అనిపించదు.
అలాంటి గమ్యాలను వదిలేయడమే మంచిది. అలా వదిలివేయలేకపోతే ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక నరకయాతన పడాల్సి వస్తుంది.
నువ్వు చేరాలనుకున్న దారి ఎలా లక్ష్యం మాత్రం నీకు తృప్తినివ్వాలి. అలా కాని పక్షంలో నువ్వెంత సాధించినా వృధానే.
Details
ఎలాంటి సమయాల్లో వదులుకోవాలంటే?
వదులుకోవడంలో ఆనంద ఉంది నిజమే, ఎక్కడ వదులుకోవాలనేది తెలిసుండాలి. వదిలివేయాలని నీ మనసులో బలంగా అనిపించిందనుకో వదులుకోవడమే మంచిది.
ఇంకా, వేరేవాళ్ళు ఏమనుకుంటారోనన్న ఆలోచనతో వదలాలా వద్దా అని ఆలోచిస్తున్నావంటే గమ్యం మీద నీకెప్పుడో ఆసక్తి పోయిందన్న మాటే. ఈ క్షణం వెంటనే వదిలివేయకపోతే నువ్వు రోజూ ఛస్తూ బతకాల్సి వస్తుంది.
అదీగాక ముందుగా చెప్పినట్టు నువ్వు చేరాలనుకున్న గమ్యం, నీకెలాంటి ఆసక్తి కలిగించకపోతే వదిలేసి మరో గమ్యం నిర్దేశించుకోవడమే ఉత్తమం.
అయితే ఇలా వదిలేయాలంటే ధైర్యం కావాలి. రిస్క్ చేయాలి. ధైర్యం ఉన్నోడినే విజయం వరిస్తుంది. మీకు ఆనందం ఇవ్వకపోయినా ఒక పనిని చేస్తూ ఉన్నారంటే మీలో ధైర్యం లేనట్టే లెక్క.