ప్రేరణ: పెద్ద లక్ష్యాన్ని సాధించాలన్న కోరిక నీలో ఉంటే చిన్న లక్ష్యాలను అందుకునే సత్తా నీలోఉండాలి
ఈ వార్తాకథనం ఏంటి
లైఫ్ లో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ఏ లక్ష్యం లేనివారు ఎవ్వరూ ఉండరు. సాధారణంగా నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావ్ అని ఎవరినైనా అడిగితే కొందరు సమాధానం చెబుతారు.
మరికొందరు సాధించడానికి ఏదీ లేదని చెబుతారు. అంటే గొప్పగా సాధించాలన్న కోరిక లేదని చెబుతారు. ఇలాంటి వాళ్లకు ఎప్పుడో చేరుకునే లక్ష్యం మీద ఇంట్రెస్ట్ ఉండదు.
ఇప్పుడు చేసే పనిలో ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు చేసే పని పూర్తికావాలన్న ఆలోచన కూడా లక్ష్యమే.
నువ్వు నీ జీవితంలో పెద్ద లక్ష్యం సాధించాలంటే లక్ష్యం లేని వాళ్లలాగా ఇప్పుడు చేయాల్సిన పనిని పూర్తి చేసుకుంటూ వెళ్లాలి.
ఇప్పుడు చేస్తున్న పనిని పూర్తి చేసుకుంటూ పోతేనే పెద్ద లక్ష్యం అందుతుంది.
Details
స్నానం చేయడం, రెడీ అవడం చిన్న లక్ష్యాలు
ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలంటే ఈ ఉదాహరణ చూద్దాం. నువ్వు ఒక పెళ్ళికి వెళ్లాలనుకున్నావ్. మీ ఊరి నుండి 50కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరిలో పెళ్ళి జరుగుతుంది.
నీకోసం కారు పంపిస్తా అన్నారు. ఆ సమయానికి నువ్వు స్నానం చేసి, రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నావ్. ఆ కార్ రాగానే నువ్వు వెళ్ళిపోయావ్.
ఇక్కడ సమయానికి స్నానం చేయడం, రెడీ అవడం అనేవి చిన్న లక్ష్యాలు. వాటిని నువ్వు కరెక్టుగా పూర్తి చేస్తేనే లక్ష్యాన్ని అనుకున్న సమయానికి చేరుకోగలిగావ్. లేదు, కార్ వచ్చిన తర్వాత స్నానం చేస్తా అనుకుంటే, ఆ కారు వెళ్ళిపోయే అవకాశం ఉండవచ్చు.
అంటే నువ్వు చేస్తున్న పనిని సక్రమంగా చేసుకుంటూ వెళ్తే లక్ష్యం తొందరగా చేరుకోగలవు అన్నమాట.