NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రేరణ: కంఫర్ట్ జోన్ లో ఇరుక్కున్నావంటే విజయం ఎప్పుడూ అందని ద్రాక్షే 
    తదుపరి వార్తా కథనం
    ప్రేరణ: కంఫర్ట్ జోన్ లో ఇరుక్కున్నావంటే విజయం ఎప్పుడూ అందని ద్రాక్షే 
    కంఫర్ట్ జోన్ లోంచి బయటకు వస్తేనే విజయం దక్కుతుంది

    ప్రేరణ: కంఫర్ట్ జోన్ లో ఇరుక్కున్నావంటే విజయం ఎప్పుడూ అందని ద్రాక్షే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 16, 2023
    06:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నీకు చిన్న బిజినెస్ ఉంది, నెలకు ఎంతో కొంత సంపాదిస్తున్నావ్, వాటితో హాయిగా గడిచిపోతుంది. పెద్దగా డబ్బులు మిగలడం లేదు కానీ అప్పు చేయాల్సిన పరిస్థితి మాత్రం రావడం లేదు.

    డబ్బులు ఎక్కువ మిగలాలంటే ఇంకొంచెం మార్కెటింగ్ చేయాలని నీకు తెలుసు. అయినా ఎందుకులే అని ఊరుకుంటున్నావంటే నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉన్నట్టే లెక్క.

    ఆ జోన్ లో ఉన్నప్పుడూ హ్యాపీగానే ఉంటుంది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అనుకోని పరిణామాల్ని నీ ముందుంచుతుంది. కంఫర్ట్ జోన్ లో ఉన్న నిన్ను ఆ పరిణామాలు ఇబ్బంది పెడతాయి.

    ఆరోగ్యం పాడవడం వల్ల డబ్బు అవసరం పడవచ్చు. అనుకోకుండా బిజినెస్ లో నష్టం జరగవచ్చు. కుటుంబంలో ఏదైనా ఇబ్బంది రావచ్చు.

    Details

    ప్రయాణంలో ఆగిపోతే ముందు వెళ్ళేవాళ్లే కనిపిస్తారు 

    కంఫర్ట్ జోన్ దాటి బయటకు రాలేకపోతే వాళ్లకు విజయం ఎప్పటికీ దక్కదు. విజయాన్ని సాధించే సామర్థ్యం ఉన్నా చాలామంది గొప్ప గొప్ప విజయాలు అందుకోకపోవడానికి కారణం కంఫర్ట్ జోన్ దాటి బయటకు రాకపోవడమే.

    కష్టం అంటే భయపడేవాళ్ళకు విజయం ఎప్పటికీ దక్కదు. మీరు కూడా అలాంటి జోన్ లో ఉన్నారేమో చెక్ చేసుకోండి. మీకున్న టాలెంట్ కి సానబట్టండి. కొత్త కొత్త దారులలో ప్రయాణించండి.

    రోజూ చూసే పార్కు పదవ రోజుకు బోర్ కొట్టేస్తుంది. అడవి మాత్రం ఎప్పటికీ బోర్ కొట్టదు. మీ వేట అడవిలో సాగాలే తప్ప పార్కులో కాదు.

    ఆగిపోయిన వాడెప్పుడూ తనముందు వెళ్తున్న వాళ్లను చూస్తుంటాడు. ప్రయాణించే వాడెప్పుడూ కొత్త ప్రపంచాన్ని చూస్తుంటాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రేరణ
    విజయం
    జీవితం

    తాజా

    Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు! బంగారం
    Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి బాలీవుడ్
    Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు డిస్నీ
    Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్! ప్రభాస్

    ప్రేరణ

    ప్రేరణ: గడిచిన నిన్న గురించి ఆలోచించడం కన్నా రాబోయే రేపు గురించి పనిచేయడం ఉత్తమం  లైఫ్-స్టైల్
    ప్రేరణ: నువ్వు చేసే పని రేపటి నీ భవిష్యత్తుకు ఉపయోగపడకపోతే ఈరోజే దాన్ని వదిలెయ్  జీవితం
    ప్రేరణ: ఒక పనిలో బెస్ట్ అవ్వాలంటే ఆ పనిలోని వరస్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి  లైఫ్-స్టైల్
    ప్రేరణ: నువ్వు తీసుకున్న నిర్ణయాలకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే నీకెక్కడా రెస్పెక్ట్ దొరకదు  లైఫ్-స్టైల్

    విజయం

    ప్రేరణ: మనసు పడ్డ ప్రతీదీ మన దరికి రావాలని కోరుకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే ప్రేరణ
    విజయం వచ్చాక జాగ్రత్తగా ఉండకపోతే అపజయమే మిగులుతుంది ప్రేరణ
    ఓటమి భయాల్ని అధిగమించాలంటే చేయాల్సిన పనులు జీవనశైలి
    ప్రేరణ: ప్రయత్నించాలన్న నిర్ణయం తీసుకుంటేనే పని పూర్తి చేసే సామర్థ్యం వస్తుంది  ప్రేరణ

    జీవితం

    ప్రేరణ: అంతా అయిపోయిందనుకోకండి, చీకటి పడ్డ తర్వాతే చంద్రుడు వస్తాడు  ప్రేరణ
    ప్రేరణ: నీ లక్ష్యాన్ని చేరడంలో ఆలస్యమవుతుంటే లక్ష్యాన్ని చేరుకునే దారిని మార్చాలి కానీ లక్ష్యాన్ని కాదు  ప్రేరణ
    ప్రేరణ: నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండకపోతే నువ్వు అనుకున్న గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు  ప్రేరణ
    ప్రేరణ: ఒక రంగంలో నువ్వు ఎదగాలంటే నీ పక్కన వెన్ను తట్టేవాళ్ళు ఉండాలి  ప్రేరణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025