ప్రేరణ: లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని లక్ష్యాన్ని వదులుకోవడం పిచ్చితనం
ప్రస్తుత తరం వారికి అన్నీ చాలా తొందరగా పూర్తికావాలి. నిమిషాల్లో పనులు పూర్తి కావాలనీ, క్షణాల్లో ఫలితాలు రావాలనీ కోరుకుంటారు. ఒక పనిమీద కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం టైమ్ వేస్ట్ అని అనుకుంటారు. మీరు పెట్టుకున్న లక్ష్యం గురించి కూడా మీరలానే ఆలోచిస్తుంటే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, ఒక గొప్పపని పూర్తి కావడానికి టైమ్ పడుతుంది. అనుకోగానే ఏదో జరిగిపోదు. కష్టపడాలి, కృషి చేయాలి. దానికి తప్పకుండా టైమ్ పడుతుంది. ఈ ప్రపంచంలో ఇన్ స్టంట్ కాఫీ దొరుకుతుంది ఇన్ స్టంట్ సక్సెస్ ఎక్కడ వెతికినా దొరకదు. మరో విషయం ఏంటంటే, టైమ్ గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే టైమ్ ఎప్పుడూ పోతూనే ఉంటుంది.
టైమ్ ఎప్పుడూ పోతూనే ఉంటుంది
ఇప్పుడు ఒక బిజినెస్ మొదలుపెట్టారు. దాంట్లో సక్సెస్ కావడానికి పదేళ్ళు పడుతుందని అనుకుందాం. స్టార్ట్ చేసిన కొత్తలో పదేళ్ళనగానే అమ్మో అనిపిస్తుంది. కానీ మీరు పని చేసుకుంటూ పోతే పదేళ్ళు ఇట్టే గడిచిపోతాయి. పదేళ్ల తర్వాత మీకే అనిపిస్తుంటుంది. ఇంత తొందరగా పదేళ్ళు ఎలా పూర్తయ్యాయి అని. అందుకే టైమ్ ఎక్కువగా అవుతుందని లక్ష్యాన్ని వదులుకుంటే మీరు నష్టపోతారు. ఒక పనిలో నైపుణ్యం సంపాదించాలంటే ఖచ్చితంగా టైమ్ పడుతుంది. నైపుణ్యం లేకుండా ఆ పనిలో నువ్వు సక్సెస్ కాలేవు. కాబట్టి నీకున్న సమయాన్ని నైపుణ్యం సంపాదించుకోవడానికి ఉపయోగించు. ఒక్కసారి నైపుణం సంపాదించావనుకో, అప్పుడు నీ గెలుపు ఈజీ అవుతుంది. నీకు టైమ్ గురించి పెద్దగా దిగులుండదు.