ప్రేరణ: నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా ఉన్న ఫర్వాలేదు కానీ ఆగిపోకూడదు
ఈ వార్తాకథనం ఏంటి
కొంతమంది తమ జీవితంలో గమ్యాలను చాలా తొందరగా చేరుకుంటారు. మరికొంతమందికి ఆలస్యం అవుతుంది. కొందరికైతే గమ్యం అన్న ఆలోచనే ఉండదు.
జీవిత ప్రయాణంలో ఎటు వెళ్ళాలో తెలియక, అవస్థలు పడుతూ ఉంటారు. వాళ్ళ సంగతి వదిలేద్దాం. గమ్యం వైపు తొందరగా వెళ్ళే వాళ్ల గురించి కూడా వదిలేద్దాం.
ఎందుకంటే వాళ్ళకు మీకంటే ఎక్కువ తెలివి ఉండవచ్చు, డబ్బుండవచ్చు, లేదా గమ్యానికి దగ్గర చేసే విషయాలు వాళ్ళలో ఉన్నాయి కావచ్చు.
పైవేవీ మీ దగ్గర లేకపోవచ్చు. అలా అని మీరు నిరాశ పడకండి. గమ్యం వైపు వెళ్ళడం మానకండి. మీకున్న తెలివి వల్ల, ఇంకా చాలా విషయాల వల్ల గమ్యం వైపు మీ ప్రయాణం నెమ్మదిగా ఉంది కావచ్చు. అలా అని ప్రయాణాన్ని ఆపకండి.
Details
ప్రయాణంలో ఆగిపోతే ఒంటరిగా మిగులుతావ్
నెమ్మదిగా ప్రయాణం చేసినంత మాత్రాన గమ్యం చేరలేరని కాదు. కుందేలు, తాబేలు కథలో కుందేలు విశ్రాంతి తీసుకుంటుంది. తాబేలు మాత్రం నెమ్మదిగా నడుస్తూ గమ్యాన్ని చేరుకుంటుంది.
ఎప్పుడూ తాబేలులా ఉంటే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటావ్. అప్పుడు నీ నడక చూసి నవ్విన వాళ్ళే నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు.
అందుకే ఏదైనా ఒక పనిచేయాలనుకుని ముందుకు అడుగు వేస్తే, ఆ పనిని పూర్తి చేసేవరకు వదిలిపెట్టకండి. గమ్యం వైపు నడుస్తూ ఉంటే కొత్త కొత్త మనుషులు కనిపిస్తారు. ఆగిపోతే నీ దగ్గర నుండి మనుషులు మాయమైపోయి ఒంటరిగా మిగులుతావు.
ఒంటరిగా ఉంటావా? కొత్తవాళ్ళతో కలుస్తూ కొత్త విషయాలను తెలుసుకుంటూ మెదడును మరింత షార్ప్ చేసుకుంటావా అనేది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.