Page Loader
ప్రేరణ: భయానికి అవతల ఏముందో తెలుసుకుంటేనే జీవితం 
భయానికి అవతల ఏముందో తెలుసుకుంటేనే జీవితం

ప్రేరణ: భయానికి అవతల ఏముందో తెలుసుకుంటేనే జీవితం 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 09, 2023
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

భయం అనేది మనుషులను ముందుకు వెళ్ళకుండా ఆపేస్తుంది. గెలవడానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఆ అడ్డంకులకు భయపడితే గెలవలేరు. చాలామంది భయం వల్లనే తమ జీవితంలో అనుకున్నది సాధించలేరు. ఎంతో చేయాలని, ఏదో చేయాలని తపనపడి చివరికి భయపడి ఆగిపోతుంటారు. చాలామంది విజేతలుగా మారడానికి కారణం భయం లేకపోవడమే. లేదా భయాన్ని అర్థం చేసుకోవడం. భయం లేకపోవడం గురించి పక్కన పెడితే, భయాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అసలు ఎందుకు భయం? భయపడితే ఏమవుతుంది? భయపడకపోతే ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచిస్తే భయం గురించిన ఆలోచన మీ మనసులోకి రాదు.

Details

భయపడితే జాబ్ వస్తుందా? 

మీరొక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఇంటర్వ్యూ అంటే మీకు చాలా భయం. అరచేతిలో చెమట్లు పట్టేంత పిరికి. కానీ ఒక్కటి ఆలోచించండి. మీరు భయపడటం వల్ల ఏదైనా లాభముందా? ఇప్పుడు మీరు భయపడటం వల్ల ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారా? లేదా భయపడుతుంటే మీ భయాన్ని చూసి మీకు జాబ్ ఇస్తారా? పైవన్నింటికీ మీ సమాధానం అవును అయితే భయపడండి. లేదు అయితే భయాన్ని వదిలేయండి. భయపడితే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు, జాబ్ రాదు. కానీ భయాన్ని వదిలేస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఏ విషయంలో భయపడినా ఈ విధంగా ఆలోచించండి. అప్పుడు మీకు ఎందుకు భయపడాలో, ఎందుకు భయపడకూడదో అర్థం అవుతుంది.