ఓటమి భయాల్ని అధిగమించాలంటే చేయాల్సిన పనులు
ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదా ఏదైనా పని చేస్తున్నా ఆ పనిలో సక్సెస్ అవుతామో లేదోనన్న భయం ఉంటుంది. సక్సెస్ అయితే సమస్య లేదు కానీ ఫెయిల్ అయితే ఏం చేయాలన్నది అర్థం కాదు. మనలో చాలామందికి ఓటమిని ఎలా తీసుకోవాలో తెలియదు. విజయాన్ని ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలో తెలిసిన మనకి ఓటమిని ఎలా ఒప్పుకోవాలో తెలియకపోవడం విచిత్రం. ఓటమిని ఎలా ఎదుర్కోవాలంటే: మీరొక విషయంలో ఓడిపోయారు. అప్పుడు వెంటనే మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. అది మీ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఒక్కోసారి ఆత్మహత్య ఆలోచనలకు దారి తీయవచ్చు. అందుకే ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరించండి. మిమ్మల్ని మీరు నిందుంచుకోవడం ఆపేయండి. ముందు ముందు మీరు చాలా సాధించే అవకాశం ఉందని గుర్తుంచుకోండి.
ఓటమిని పాఠంలా భావిస్తే విజయానికి మెట్టుగా అదే మారుతుంది
ఓడిపోతే ఏం చేయాలో ముందే ఆలోచించండి: ఒక కాయిన్ ని బొమ్మా బొరుసు ఎలా ఉంటాయో ఒక పనికి కూడా ఓటమి విజయం రెండూ ఉంటాయి. విజయం అందుకున్నప్పుడు ఏం చేయాలో ఆల్రెడీ అనుకునే ఉంటారు కదా. అలాగే ఓడిపోతే ఏం చేయాలనేది ఆలోచించి పెట్టుకోండి. మీ బలాలను గుర్తు తెచ్చుకోండి: మీరొక పనిలో ఓడిపోయారు కావచ్చు. అలా అని మీరు చేతకాని వారేమీ కాదు. మీరు చాలా విషయాల్లో అందరికన్నా ముందుంటారు. ఆ బలాలను గుర్తు తెచ్చుకోండి. మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఓటమిని పాఠంలా భావించండి: మీరు ఓడిపోయారంటే మీరింకా నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నమాట. అలా ఆలోచించి ఓటమిలోంచి పాఠాన్ని స్వీకరిస్తే విజయానికి మెట్టులా అదే మారుతుంది.