జాతీయ పోషకాహార వారోత్సవాలు: మిల్లెట్స్ పై ఫోకస్ తో ఫుడ్ ఫెయిర్ నిర్వహిస్తున్న గ్లాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
స్మార్ట్ ఫోన్ లాక్ స్క్రీన్ పై వార్తలను అందించే గ్లాన్స్, జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా ఫుడ్ ఫెయిర్ పేరుతో క్యాంపెయిన్ నిర్వహించడానికి సిద్ధమవుతోంది.
ఈ ప్రోగ్రామ్, ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఉండనుంది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా భారతీయ వంటకాలకు సంబంధించిన సమాచారం అందివ్వబోతున్నాము.
2023సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. ఈ సంవత్సరం చిరుధాన్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అందుకే మిల్లెట్స్ ప్రధానంగా గ్లాన్స్ ఫుడ్ ఫెయిర్ ఉండనుంది.
ప్రస్తుతం గ్లాన్స్ నిర్వహించబోతున్న క్యాంపెయిన్ లో, ఎలాంటి ఆహారాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి మొదలు, భారతదేశంలో ట్రెండ్ అవుతున్న ఫుడ్ వెరైటీస్ గురించి సమాచారం అందించబోతున్నాము.
Details
హైలైట్ గా నిలవనున్న ఫుడ్ మ్యాప్ ఆఫ్ ఇండియా
యూజర్లకు వినోదం పంచడంతో పాటు ఆహారం విషయంలో వినియోగదారులను ఎడ్యుకేట్ చేయడం కూడా ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశ్యం.
ఈ క్యాంపెయిన్ లో, సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న వారి ఆహార అలవాట్లు, వారి ఫేవరేట్ ఫుడ్ లాంటి విషయాలను వెల్లడి చేయబోతున్నాము.
అంతేకాదు, గ్లాన్స్ నిర్వహించే ఈ క్యాంపెయిన్ లో గ్లాన్స్ ఫుడ్ మ్యాప్ ఆఫ్ ఇండియా హైలైట్ గా నిలవనుంది. ఇందులో ఉత్తరాది ఆహారాల నుండి దక్షిణాది వెరైటీల వరకూ సమాచారం ఉంటుంది.
భారతదేశంలో ఎన్ని రకాల ఆహార సంస్కృతులు ఉన్నాయో ఈ మ్యాప్ ద్వారా యూజర్లు తెలుసుకోవచ్చు.
ఎనిమిది భాషల్లో సేవలు అందిస్తున్న గ్లాన్స్, భారతదేశంలోని ప్రతీ పౌరుడికి భారతదేశ ఆహార సంస్కృతులను పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
Details
గ్లాన్స్ విశేషాలు
2019లో స్థాపించబడిన గ్లాన్స్, రోపోసో, నోస్ట్రా, అనే ఫ్లాట్ ఫామ్ లను కూడా వినియోగదారులకు అందుబాటూలో ఉంచింది.
ఇంటర్నెట్ వినియోగాన్ని లాక్ స్క్రీన్ మీదనే ఉపయోగించే సరికొత్త ఆవిష్కరణకు గ్లాన్స్ తెరలేపింది. దీనివల్ల యాప్ డౌన్లోడ్ చేసుకునే అవసరం గానీ, సెర్చ్ చేయాల్సిన పని గానీ లేదు.
400మిలియన్ల స్మార్ట్ ఫోన్లలో గ్లాన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే యూజర్లకు సరికొత్త ఇంటర్నెట్ అనుభవాన్ని అందిస్తున్నాయి.
గ్లాన్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే glance.com, roposo.com ఇంకా inmobi.com వెబ్ సైట్స్ సందర్శించండి.