Page Loader
నేషనల్ బనానా డే: అరటి పండుతో నోరూరించే రెసిపీస్ ఎలా చేయాలో తెలుసుకోండి 
అరటి పండుతో తయారయ్యే రెసిపీస్

నేషనల్ బనానా డే: అరటి పండుతో నోరూరించే రెసిపీస్ ఎలా చేయాలో తెలుసుకోండి 

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 19, 2023
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన జాతీయ అరటి దినోత్సవాన్ని జరుపుకుంటుంది అమెరికా. ఈ నేపథ్యంలో అరటి పండుతో రకరకాల రెసిపీస్ తయారు చేసుకుంటారు. ప్రస్తుతం అరటి పండుతో తయారయ్యే రెసిపీస్ ఏంటో చూద్దాం. బనానా బ్రెడ్: అరటి పండును నలగ్గొట్టి పాలల్లో కలపాలి. ఇప్పుడు మైదా పిండిని కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి. బ్రెడ్ తయారీకి ఉపయోగించే పాత్రకు నూనె రాసి, మైదాపిండి మిశ్రమాన్ని ఆ పాత్రలో పోయాలి. 180డిగ్రీల దగ్గర 20-30నిమిషాల పాటు బేక్ చేయాలి. చల్లారగానే హ్యాపీగా తినేయండి. బనానా జ్యూస్: అరటి పండు, పాలు, పీనట్ బటర్, తీసుకుని గ్రైండర్ లో రుబ్బాలి. ఆ తర్వాత ఫ్రిజ్ లో పెట్టుకుని చల్లారిన తర్వాత తాగడమే.

Details

అరటి పండుతో తయారయ్యే రెసిపీస్ 

అరటి పండుతో టీ: అరటి పండు టీ గురించి మీరెప్పుడూ విని ఉండరు. దీన్ని తయారు చేయడం చాలా ఈజీ. తొక్క తీయకుండా పండును ముక్కలుగా కోయాలి. ఒక పాత్రలో నీళ్ళు మరిగించి, అరటి ముక్కలను అందులో వేయాలి. అరటి తొక్క దానంతట అదే విడిపోయేవరకు మరిగించాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క పొడి వేసుకుని హ్యాపీగా తాగేయడమే. అరటి పండు చిప్స్: అరటి పండును ముక్కలుగా కత్తిరించి, పసుపు, ఉప్పు, నీళ్ళు కలిసిన మిశ్రమంలో ఐదు నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత నీళ్ళను పారబోసి అరటి ముక్కలను వేడి నూనెలో వేయాలి. బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించి బయటకు తీయాలి.