
National Blueberry month: బ్లూ బెర్రీలతో ఫేస్ మాస్క్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో జులై నెలని నేషన్ బ్లూ బెర్రీ మంత్‌గా జరుపుకుంటారు. ఈ నెలలో బ్లూ బెర్రీని చర్మ సంరక్షణ కోసం ఎక్కువగా వాడతారు.
ఆహారంగా తీసుకుని శరీరానికి, ఫేస్ మాస్క్ లాగా ఉపయోగిస్తే చర్మ సంరక్షణకు బ్లూ బెర్రీ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చర్మ సంరక్షణలో బ్లూ బెర్రీ ఫేస్ మాస్క్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.
బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ ఫేస్ మాస్క్:
కొన్ని బ్లూ బెర్రీస్, కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకుని గ్రైండర్‌లో వేసి రుబ్బి మిశ్రమాన్ని తయారు చేయండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి మర్దన చేసుకుని 30నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.
ఇలా చేయడం వల్ల ముఖం తేమగా, మృదువుగా, యవ్వనంగా మారుతుంది.
Details
జిడ్డు చర్మంతో బాధపడేవారికి ఉపయోగపడే ఫేస్ ప్యాక్
బ్లూ బెర్రీ, పెరుగు ఫేస్ ప్యాక్:
జిడ్డు చర్మంతో బాధపడేవారికి ఈ ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. బ్లూ బెర్రీలను నలగ్గొట్టి పేస్ట్ తయారుచేసి, కొంచెం పెరుగు, తేనే, ఆలివ్ ఆయిల్ కలపాలి.
ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి రుద్దుకుని 25నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ముఖం జిడ్డు ఏర్పడకుండా ఉంటుంది.
బ్లూ బెర్రీ, కలబంద ఫేస్ ప్యాక్:
బ్లూ బెర్రీలను నలగ్గొట్టి పేస్ట్ తయారు చేయండి. ఇప్పుడు కలబంద రసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి ఫేస్ మాస్క్ పెట్టుకోవాలి.
40నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటే సరిపోతుంది.
కలబందలో చర్మానికి మేలు చేసే పోషకాలు మీ చర్మాన్ని తళతళా మెరిసేలా తయారు చేస్తాయి.