నేషనల్ కుక్ స్వీట్ పొటాటో డే 2023 రోజున ప్రయత్నించాల్సిన రెసిపీస్
స్వీట్ పొటాటో.. వీటిని మనదగ్గర కొందరు కందగడ్డ అని, మరికొందరు రత్నపురి గడ్డలని అంటారు. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన నేషనల్ కుక్ స్వీట్ పొటాటో డే ని అమెరికా ప్రజలు జరుపుకుంటారు. స్వీట్ పొటాటో ఆరోగ్యానికి చాలా మంచిది. దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేయడంలో స్వీట్ పొటాటో సాయపడుతుంది. మరలాంటి స్వీట్ పొటాటో తో ఎలాంటి రెసిపీస్ తయారు చేయవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. స్వీట్ పొటాటో గారెలు: స్వీట్ పొటాటోలను నీళ్ళతో కడిగి, దోరగా వేయించి, పొట్టు తీసేసి వాటిని నలగ్గొట్టాలి. ఆ తర్వాత కుత్తు పిండి, కారం, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, మామిడికాయ పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత గారెల్లాగా చేసి ఫ్రై చేస్తే సరిపోతుంది.
స్వీట్ పొటాటోతో తయారు చేయగలిగే రెసిపీస్
స్వీట్ పొటాటో ఫ్రై: స్వీట్ పొటాటోలను ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండి, మొక్కజొన్నపిండి, కారం, ఉప్పు ఒక దగ్గర కలపాలి. ఇప్పుడు స్వీట్ పొటాటో ముక్కలను బియ్యం పిండి మిశ్రమంలో ముంచి నూనె లో వేయిస్తే సరిపోతుంది. మైనీస్ తో అద్దుకుని తింటే అదిరిపోతుంది. హల్వా: స్వీట్ పొటాటోలను శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడకబెట్టాలి. ఆ తర్వాత స్వీట్ పొటాటోలను నలిపేసి ఆయిల్ పోసిన పాత్రలో వేయించాలి. ఇప్పుడు పాలు, చక్కెర, నీళ్ళు, ఏలకులపొడి వేసి 2నిమిషాలు వేడి చేయాలి. కుంకుమ పువ్వు, బాదం, కాజు, పిస్తా, నెయ్యి కలుపుకుని హాపీగా వడ్డించండి.