నేషనల్ ఫ్రెంఛ్ ఫ్రైస్ డే 2023: ఫ్రెంఛ్ ఫ్రైస్ అనేవి ఫ్రాన్స్ కు చెందినవి కావని మీకు తెలుసా?
ఫ్రెంఛ్ ఫ్రైస్.. ఈ స్నాక్స్ గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు. బంగాళదుంపలను నిలువుగా కోసి ఫ్రై చేస్తే ఫ్రెంఛ్ ఫ్రైస్ తయారవుతుంది. అయితే ప్రతీ ఏడాది జులై 13వ తేదీన నేషనల్ ఫ్రెంఛ్ ఫ్రైస్ డే జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం నుండి జులై నెలలో వచ్చే రెండవ శుక్రవారాన్ని నేషనల్ ఫ్రెంఛ్ ఫ్రైస్ డే గా జరుపుకోవాలని నిర్ణయించారు. అంటే ఈ సంవత్సరం జులై 14న ఫ్రెంఛ్ ఫ్రైస్ దినోత్సవం జరుగుతుంది. ఫ్రెంఛ్ ఫ్రైస్ అనగానే ఇవి ఫ్రాన్స్ కు చెందిన ఆహారం కావచ్చని అనుకుంటారు, కానీ కాదు. ఇవి బెల్జియం దేశానికి చెందినవి. బెల్జియం దేశంలో మ్యూస్ లోయలో నివసించే జనాలకు అక్కడ నదిలో చేపలను తినడం అలవాటు.
అమెరికన్ సైనికులు తీసుకొచ్చిన పాపులారిటీ
ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయినపుడు నదులు గడ్డకట్టుకుపోయి చేపలు దొరకవు. అలాంటి టైమ్ లో బంగాళదుంపలను చేపల మాదిరిగా ఫ్రై చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ ఆహారాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమెరికాసైనికులే. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బెల్జియంలో ఉన్న అమెరికన్ సైనికులు, ఫ్రెంఛ్ ఫ్రైస్ ని స్నాక్స్ లాగా తినేవారు. అప్పటి నుండి ఈ ఆహారం పాపులర్ అయ్యింది. ఫ్రెంఛ్ ఫ్రైస్ డే ని ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలంటే? మీ కుటుంబం, స్నేహితులను పిలిచి ఫ్రెంఛ్ ఫ్రైస్ పార్టీ చేయండి. రకరకాల వెరైటీల్లో ఫ్రెంఛ్ ఫ్రైస్ తయారు చేసి వాటిని తినడానికి మయనీస్, కెచప్ వంటి సాస్ లను ఉంచండి. ఇంకా మీ ఇంట్లోనే ఫ్రెంఛ్ ఫ్రైస్ తయారు చేయండి.