National Strawberry Day 2023: స్ట్రాబెర్రీలతో ఈ రెసిపీలు ట్రై చేస్తే టేస్ట్ అదుర్స్
ఈ వార్తాకథనం ఏంటి
స్ట్రాబెర్రీ.. వేసవిలో విరివిగా లభించే అత్యంత రుచికరమైన, ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. స్ట్రాబెర్రీలో శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్‌లు ఉంటాయి. సోమవారం(ఫ్రిబవరి 27) నేషనల్ స్ట్రాబెర్రీ డే 2023 కావడంతో స్ట్రాబెర్రీతో చేసే కొన్ని రెసిపీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీ మిల్క్ షేక్: స్ట్రాబెర్రీ ముక్కలను జార్‌లో వేసి అందులో కొన్ని పాలు పోసి బ్లెండ్ చేయాలి. మెత్తగా అయ్యాక, ఆ మిశ్రమంలో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌ను తగినంత వేసి మళ్లీ మిక్సీలో పట్టాలి. అంతే, ఇక చల్లచల్లగా ఉండే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. చిన్న చిన్న స్ట్రాబెర్రీ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే అటు లుక్‌లోనూ ఇటు టేస్ట్ కూడా అదిరిపోతుంది.
స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీ బాసిల్ సోడా, స్ట్రాబెర్రీ లస్సీ తయారీ ఇలా
స్ట్రాబెర్రీ బాసిల్ సోడా: వేసవిలో రీఫ్రెష్ కావడానికి స్ట్రాబెర్రీ బాసిల్ సోడా తోడ్పడుతుంది. స్ట్రాబెర్రీలు, తగినంత చెక్కర, తురిమిన తులసి ఆకులు, నారింజ రసం లేదా తగినంత ఉప్పు, బాల్సమిక్ వెనిగర్‌ను మిశ్రమంగా కలపాలి. ఆ మిశ్రమాన్ని వడకట్టి, సోడా నీరు, ఐస్ వేసి బాగా షేక్ చేయడంతో స్ట్రాబెర్రీ బాసిల్ సోడా రెడీ అవుతుంది.
స్ట్రాబెర్రీ లస్సీ: స్ట్రాబెర్రీ, పెరుగుతో తయారు చేసే ఈ స్ట్రాబెర్రీ లస్సీని వేసవి కూలర్ అని పిలుస్తుంటారు. తొలుత స్ట్రాబెర్రీ, చక్కెర, నీరు, రుచికరమైన పెరుగు, కొంచెం ఐస్ వేసి బ్లెండ్ చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని పొడవైన గ్లాసులోకి తీసుకొని, తాజా స్ట్రాబెర్రీ బిట్స్‌తో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకోవాలి.