
జాతీయ విటమిన్ సి దినోత్సవం: విటమిన్ సి దొరికే జ్యూసెస్ ఏంటో చూద్దాం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఏప్రిల్ 4వ తేదీని జాతీయ విటమిన్ సి దినోత్సవంగా జరుపుకుంటారు. విటమిన్ సి కారణంగా శరీరానికి కలిగే ఆరోగ్యంపై అవగాహన కలిగించేందుకు ఈ రోజును జరుపుతారు.
విటమిన్ సి కారణంగా శరీరంలోని వ్యర్థపదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. చర్మ సంరక్షణలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ విటమిన్ సి సాయపడుతుంది.
మరి అలాంటి "విటమిన్ సి" పోషకాన్ని శరీరానికి జ్యూసుల ద్వారా అందించవచ్చు. ఆ జ్యూసెస్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
క్యారెట్, పాలకూర, టమాట జ్యూస్:
క్యారెట్ ముక్కలను తరిగి, పావు కప్పు పాలకూరను కలిపి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత పావుకప్పు టమాట ముక్కలను, నీళ్ళను కలిపి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు జ్యూస్ తయారవుతుంది.
విటమిన్ సి
విటమిన్ సి దొరికే జ్యూసెస్
ఫ్రూట్ జ్యూస్:
అరటిపండ్లు, మామిడి, నారింజ పండ్ల ముక్కలను తీసుకుని వాటిని అల్లం, తేనె, నిమ్మరసం, బాదంపాలు కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఇప్పుడు క్రీమ్ లాగా తయారవుతుంది. ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగడమే.
స్ట్రాబెర్రీ జ్యూస్:
స్ట్రాబెర్రీ, మామిడి, అరటిపండు, పైనాపిల్ ముక్కలను తీసుకుని గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత అవిసెగింజలు, అరకప్పు చియా విత్తనాలను కూడా కలిపి గ్రైండ్ చేయాలి. క్రీమ్ లాగా తయారైన ద్రవాన్ని గ్లాసుల్లో పోసుకుని తాగడమే.
విటమిన్ సి టీ:
నుజ్జు నుజ్జు చేసిన మందారం, రోజ్ హిప్స్, చిటికెడు కుంకుమ పువ్వు, ఎండిపోయిన నిమ్మతొక్కను ఒక పాత్రలో వేసి నీళ్ళు కలిపి టీ ఆకులను కలపాలి. 5నిమిషాలు వేడి చేసి, వడబోసి టీ తాగేయండి.