జాతీయ నడక దినోత్సవం 2023: మీ ఆయుష్షును, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కాసేపు నడవండి
ఎంత నడిస్తే ఎంత ఆరోగ్యం వస్తుందన్న అనుమానాలు చాలామందిలో కలుగుతాయి. ఒకరోజులో ఎంత నడవాలన్న సందేహాలు ఉంటాయి. ఈ రోజు జాతీయ నడక దినోత్సవం. ఏప్రిల్ నెలలో వచ్చే మొదటి బుధవారాన్ని జాతీయ నడక దినోత్సవంగా జరుపుతారు. నడక వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది: ప్రస్తుతం ఒత్తిడి అనేది కామన్ ఐపోయింది. ప్రతీ ఒక్కరూ దీని బారిన పడుతున్నారు. టీనేజర్లు కూడా ఒత్తిడి ఫీలవుతున్నారు. ఇలంటి వాళ్ళు 10నిమిషాలు వేగంగా నడిస్తే ఒత్తిడి నుండి రిలీఫ్ వస్తుంది. బరువు తగ్గుతారు: రోజులో ఒకగంట వేగంగా నడిస్తే శరీరంలో పేరుకున్న కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారు. బరువు తగ్గడం మీ లక్ష్యమైతే రోజూ గంటసేపు వేగంగా నడవండి.
రొమ్ముక్యాన్సర్, గుండె వ్యాధులను నివారించే కాలినడక
రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది: వారంలో 7గంటలు నడిచే మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం 14శాతం తక్కువగా ఉంటుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది: జలుబు వంటి వ్యాధులు తరచుగా రాకుండా ఉండేందుకు నడక సాయపడుతుంది. రోజులో కనీసం 20నిమిషాలు నడిచిన వారు, రోగాల బారిన పడకుండా ఉంటారు. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది: నడక వల్ల రక్తప్రసరణ పనితీరు మెరుగుపడుతుంది. దానివల్ల గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. అందుకే రోజుకు కనీసం 30నిమిషాలైనా నడవండి. రక్తంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి: డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలనుకునేవారు నడకను తమ జీవితంలో భాగం చేసుకోవాలి. రోజూ గంటపాటు నడిస్తే బాగుంటుంది.