ఒత్తిడి ఎక్కువైపోతుంటే తగ్గించుకోవడానికి చేయాల్సిన అల్లరి పనులు
ప్రస్తుతం ప్రపంచమంతా పరుగులు పెడుతూనే ఉంది. కొంతమందికి దేనికోసం పరిగెడుతున్నామో తెలియకపోయినా పక్కవారు పరిగెడుతున్నారు కదా అన్న ఉద్దేశంతో కంగారుపడుతూ పరుగులు తీస్తున్నారు. ఈ కారణంగా శరీరానికి అలసట, మనసుకు ఒత్తిడి కలుగుతుంది. చాలామంది ఒత్తిడిని సరిగ్గా పట్టించుకోవట్లేదు. అందుకే ఒత్తిడి పై సరైన అవగాహన కొరకు ఏప్రిల్ నెలను స్ట్రెస్ అవేర్నెస్ మంత్ గా జరుపుతున్నారు. అసలు ఒత్తిడి ఎందుకు వస్తుందో చూద్దాం. బంధాల్లో కలిగే సమస్యలు, డబ్బు వల్ల ప్రాబ్లమ్స్, పని విషయంలో ఏర్పడే ఇబ్బందులు, ప్రపంచంతో సరిగా సంబంధాలు లేకపోవడం.. మొదలైనవన్నీ ఒత్తిడికి దారితీస్తాయి. ఒత్తిడి వల్ల బీపీ పెరుగుతుంది. హృదయ సంబంధ సమస్యలు వస్తాయి. తలనొప్పులు, అలసట ఇబ్బంది పెడుతుంటాయి.
ఒత్తిడి తగ్గించాలంటే చేయాల్సిన పనులు
రూమ్ లో ఒంటరిగా డాన్స్ చేయండి కిటికీలు, తలుపులు అన్నీ మూసుకొని చెవుల్లో ఇయర్ ఫోన్స్ తగిలించుకుని మీకు నచ్చిన పాటలు పెట్టుకుని మీకు నచ్చిన విధంగా డాన్స్ చేయండి. డాన్స్ వల్ల మీ నరాలు ఉత్తేజితమవుతాయి, మెదడులో హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. ప్రకృతిలో నడవండి పొద్దున లేవగానే ఫోన్ వైపు చూడకుండా హ్యాపీగా ప్రశాంతమైన వాతావరణంలో నడక మొదలెట్టండి. చుట్టూ పచ్చని చెట్లు, అందమైన ప్రదేశాలు ఉంటే మరింత ఆహ్లాదంగా ఉంటుంది. పెంపుడు జంతువులతో సమయం గడపండి పిల్లి, కుక్క, ఉడుత.. ఏదైనా సరే మీ పెంపుడు జంతువులతో కొంత సమయం గడపండి దానివల్ల మీ మనసులోని ఒత్తిడి దూరమైపోతుంది. చిన్నప్పటి కార్టూన్స్ చూసినా ఒత్తిడి దూరమైన ప్రశాంతంగా ఉంటుంది.