ఆరోగ్యం: నోటి పూత ఇబ్బంది పెడుతున్నట్లయితే టూత్ పేస్ట్, తేనె ట్రై చేయండి
శరీరంలో విటమిన్ల కొరత కారణంగా పెదవి లోపలి భాగంలో చిన్న చిన్న పుండ్లు తయారవుతాయి. వీటిని నోటి పూత అంటారు. ఇవి కేవలం పెదవి లోపలి భాగంలోనే కాకుండా నాలుక మీదా, చిగుళ్ళ మీదా, అంగిలి భాగంలో అవుతుంటాయి. నోటిపూత సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటించండి. ఉప్పునీళ్ళతో పుక్కిలించడం: ఉప్పులోని యాంటీసెప్టిక్ పదార్థాలు నోటిపూతను తగ్గిస్తాయి. దీనికోసం నీటిలో ఉప్పు కలిపి నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. ప్రతీ 2గంటలకు ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బేకింగ్ సోడా పేస్ట్: దీని కారణంగా నోట్లో అస్తవ్యస్తంగా ఉన్న పీహెచ్ స్థాయిలు సరైన స్థాయిల్లోకి వస్తాయి. తద్వారా నోట్లో ఇబ్బంది తగ్గుతుంది.
టూత్ పేస్ట్, తేనె ఉపయోగించి నోటిపూతను తగ్గించే పద్దతులు
బేకింగ్ సోడాని నీళ్ళలో కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఆ పేస్ట్ ని నోటిపూత ఎక్కడ ఉందో ఆ భాగాల్లో మర్దన చేయాలి. ఆ తర్వాత ఆ పేస్ట్ పూర్తిగా ఎండిపోయిన తర్వాత నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. టూత్ పేస్ట్: టూత్ పేస్ట్ లో ఉండే లక్షణాలు నొప్పిని తగ్గించడంలో సాయం చేస్తాయి. అయితే నోటిపూతను తగ్గించాలంటే, సోడియం లారిల్ సల్ఫేట్ లేని టూత్ పేస్టులను వాడాలి. ఈ పేస్టును నోటి పూత భాగంలో ఉంచి, ఎండిపోయిన తర్వాత నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. తేనె: తేనెలో మంచి పోషకాలు ఉంటాయి.కొద్దిగా తేనె తీసుకుని నోటిపూత భాగంలో మర్దన చేయాలి. ఒకరోజులో నాలుగు సార్లు చేస్తే సరిపోతుంది.