Summer Hair Care Tips: జుట్టు జిడ్డుగా మారుతోందా? షైనీగా అవ్వడానికి ఏమి చెయ్యాలంటే..?
వేసవి కాలంలో, జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వేడి, బలమైన సూర్యకాంతి, తేమ లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. అయితే కాలుష్యం, జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. జుట్టు జిడ్డుగా మారిపోయినవారు వేసవి కాలంలో ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారు. జిడ్డుగల జుట్టుకు ఏది అప్లై చేయాలి, ఏది చేయకూడదు అనే విషయంలో మీరు గందరగోళానికి గురవుతారు. మందపాటి, నల్లటి జుట్టు కోసం ప్రజలు చాలా రకాలుగా ప్రయత్నిస్తారు, అయినప్పటికీ జిడ్డుగల జుట్టు వేసవిలో పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది.
జుట్టు ఎందుకు జిడ్డుగా మారుతుంది?
జిడ్డుగల జుట్టు, చెమట కారణంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. జిగట చాలా ఇబ్బంది పెడుతుంది.దాని వల్ల జుట్టు నిస్తేజంగా కనిపిస్తుంది. జుట్టు ఎందుకు జిడ్డుగా మారుతుంది అనే ప్రశ్న కూడా మన మదిలో తలెత్తుతుంది. అలాగే, వాటి సంరక్షణ కోసం వాటిపై ఎలాంటి వస్తువులను ఉపయోగించాలి ఇప్పుడు తెలుసుకుందాం .. ప్రతి ఒక్కరి తలలో నూనె సహజంగా ఉత్పత్తి అవుతుంది. తలపై ఉండే సెబాషియస్ గ్రంథులు .. నూనె లాంటి పదార్థం సెబమ్‌ను స్రవిస్తాయి శరీరంలో సెబమ్ అధికంగా ఉత్పత్తి అయినట్లయితే, అదనపు నూనె కనిపిస్తుంది. దీని వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉండవచ్చు.
బయట దొరికే షాంపూ,కండీషనర్ తో దుష్ప్రభావాలు
షాంపూ, కండీషనర్ వంటి ఉత్పత్తుల వల్ల కూడా జుట్టు జిడ్డుగా కనిపిస్తుంది. వీటిలో రసాయనాలు, పారాబెన్లు, సల్ఫేట్, పెట్రోలియం ఉత్పత్తులను ఉపయోగిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆ ఉత్పతులను వాడిన వారికీ స్కాల్ప్ నుండి సహజ నూనె తగ్గిపోతుంది. దీని కారణంగా జుట్టు త్వరగా జిడ్డుగా కనిపించడం ప్రారంభిస్తుంది. బయట దొరికే షాంపూ,కండీషనర్ తో మీ జుట్టుకు సరిపడకపోతే , అది జిడ్డు, అనేక ఇతర దుష్ప్రభావాలను కలిగిస్తుంది. వేడి నీటిని ఉపయోగించడం వల్ల జుట్టు జిడ్డుగా మారుతుందని కూడా నమ్ముతారు. అందువల్ల జుట్టును చల్లటి నీటితో కడగాలి. అంతే కాకుండా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు జిడ్డుగా కనిపిస్తుంది.
జిడ్డు జుట్టు మీద ఇవి అప్లై చెయ్యండి
మీ జుట్టు జిడ్డుగా ఉంటే, దానిపై తేలికపాటి షాంపూ ఉపయోగించండి. చాలా నురుగు కలిగి ఉన్న ఉత్పత్తుల కారణంగా, జుట్టు జిగటగా కనిపిస్తుంది. తేలికపాటి షాంపూలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. సరైన ఉత్పత్తిని ఎంచుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు విపరీతంగా జిడ్డుగా మారినట్లయితే, దాని సంరక్షణ కోసం పెరుగును అప్లై చేయండి. ఒక గిన్నెలో పెరుగు తీసుకుని అందులో నిమ్మకాయ, గుడ్డులోని తెల్లసొన వేయాలి. ఈ మాస్క్‌ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. పెరుగు హెయిర్ మాస్క్ జుట్టుకు పోషణనిచ్చి సహజంగా మెరుస్తుంది.
ఈ రెమెడీతో, జుట్టు మెరిసేలా కనిపిస్తుంది
ముల్తానీ మిట్టి సహజంగా జుట్టు లేదా చర్మం నుండి అదనపు నూనెను తగ్గించడానికి పనిచేస్తుంది. వేసవిలో జుట్టును బాగా సంరక్షించుకోవడానికి, దానిపై ముల్తానీ మిట్టిని అప్లై చేయండి. ముల్తానీ మిట్టిని తేనె, నిమ్మరసం కలిపి అప్లై చేయండి. దాదాపు 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీతో, జుట్టు మెరిసేలా కనిపిస్తుంది. సహజ నూనె కూడా నియంత్రించబడుతుంది.