Page Loader
Insurance Premium: హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులు తగ్గించుకోవాలి? ఈ టిప్స్ మీకోసమే!
హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులు తగ్గించుకోవాలి? ఈ టిప్స్ మీకోసమే!

Insurance Premium: హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులు తగ్గించుకోవాలి? ఈ టిప్స్ మీకోసమే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2024
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆరోగ్య బీమా ఈ రోజుల్లో అందరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వైద్య ఖర్చులు గణనీయంగా పెరిగిపోతున్న దృష్ట్యా, ఆస్పత్రి ఖర్చులను భరించటం సాధారణ ప్రజలకు చాలా కష్టంగా ఉంది. కానీ ఆరోగ్య బీమా పాలసీలకు కూడా ప్రతి ఏటా ప్రీమియం పెరుగుతూ వస్తోంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా ఆరోగ్య బీమా ప్రీమియం తగ్గించుకోవచ్చు. 1) రైడర్లను ఆచితూచి ఎంపిక చేయండి ఇన్సూరెన్స్ కంపెనీలు తరచూ అదనపు రైడర్లు (కవరేజి ఫీచర్లు) అందిస్తుంటాయి. రైడర్ల ఎంపికతో ప్రీమియం కూడా పెరుగుతుంది. అందువల్ల అవసరం లేని రైడర్లను పాలసీ రెనివల్ సమయంలో తీసుకోకుండా ఉండటం ఉత్తమం. రైడర్లను తగ్గించడం ద్వారా ప్రీమియం తగ్గించుకోవచ్చు.

Details

2) ఆన్‌లైన్ ప్లాన్ ఎంపిక చేయండి

ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ ప్లాన్స్ కొనుగోలు చేయడం ద్వారా డిస్కౌంట్లు, ప్రత్యేక ప్రమోషన్లను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ ప్లాన్లు తరచూ ఆఫ్‌లైన్ ప్లాన్ల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఏజెంట్ కమీషన్లు ఉండవు. ఈ విధంగా ప్రీమియం భారీగా తగ్గించుకోవచ్చు. 3) క్లెయిమ్‌లెస్ పాలసీ లాభాలు పొందండి చిన్న చిన్న వైద్య ఖర్చులకు బీమా క్లెయిమ్ చేయకుండా ఉంటే, రాబోయే ఏడాదిలో మీరు ప్రీమియం పెరుగకుండా చూసుకోవచ్చు. నో క్లెయిమ్ బోనస్ ద్వారా ప్రీమియం తగ్గించుకోవడం లేదా పాలసీ కవరేజీని పెంచుకోవడం సాధ్యమవుతుంది.

Details

 4) ఆరోగ్యకర జీవనశైలి, ఫిట్‌నెస్

కొన్ని బీమా కంపెనీలు ఆరోగ్యకర జీవన విధానాన్ని కొనసాగిస్తున్న పాలసీ హోల్డర్లకు రెనివల్ సమయంలో ప్రీమియం తగ్గిస్తాయి. స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు లేని వారికి మరింత తక్కువ ప్రీమియం ఉంటుంది. మీరు ఫిట్‌నెస్ ఔత్సాహికులు అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 5) సూపర్ టాప్ పాలసీతో ఆదా చేయండి ఎక్కువ ప్రీమియంతో కూడిన బేస్ పాలసీని తగ్గించి, సూపర్ టాపప్ బీమా పాలసీని పొందడం ద్వారా బీమా ప్రీమియం ఆదా చేయవచ్చు. ఇది చౌకగా ఉండటంతో పాటు, బీమా కవరేజీ తగ్గకుండా మరింత రక్షణ కల్పిస్తుంది. ఈ మార్గదర్శకాలు అనుసరించడం ద్వారా, మీరు మీ ఆరోగ్య బీమా ప్రీమియాన్ని తగ్గించుకోవచ్చు, అందుకే మీ అవసరాలకు అనుగుణంగా పాలసీని చర్చించుకోవడం చాలా ముఖ్యం.