Bathukamma Songs Lyrics: బతుకమ్మ టాప్ 5 పాటలు ఇవే.. ఆ పాటలకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్
బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ. ఇందులో ప్రధానంగా పువ్వులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి మహిళా అందంగా సిద్దమై, పువ్వులతో బతుకమ్మను పేర్చి, పూజలు చేసి, గుడికి తీసుకెళ్తారు. అక్కడ ఆరుబయట బతుకమ్మల చుట్టూ చేరి, పాటలు పాడుతూ, నాట్యం చేస్తారు. అందువల్ల, బతుకమ్మ పాటలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఆ పాటలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బతుకమ్మ పండగ వచ్చిదంటే.. ఈ పాటలు మోగాల్సిందే. మరి, ఇంకెందుకు ఆలస్యం ఆ టాప్ 5 బతుకమ్మ పాటలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
#1 ఏమెమి పువ్వొప్పునే గౌరమ్మ
"ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ... ఏమేమి కాయెప్పునే గౌరమ్మ..." అంటూ బతుకమ్మ పేర్చే పూలను గౌరవంగా ఈ పాటలో చెప్పబడుతుంది. తెలంగాణ మహిళలు గౌరమ్మను ఈ పాటతో పూజిస్తారు. #2 బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో"బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో..." అన్న ఈ పాట బతుకమ్మ పండుగ పుట్టుక కథను వివరిస్తుంది. ఇది మహిళలలో ఎంతో ప్రాచుర్యం పొందిన పాట. #3 చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ "చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ..." అన్నఈ పాట శివుడిని పూజించడానికి గానం చేస్తారు. ఈ పాటలో తెలంగాణ ఆడపడుచులు గౌరమ్మను ఎంతో భక్తితో పూజిస్తారు.
#4 ఒక్కేసి పువ్వేసి చందమామ
"ఒక్కేసి పువ్వేసి చందమామా... ఒక్క జాము ఆయె చందమామా..." ఈ పాట గౌరమ్మ, శివుడి ఆరాధనతో సాగుతుంది. తెలంగాణ మహిళలు ఈ పాటను మధురంగా పాడుతూ పండుగను జరుపుకుంటారు. #5 రామ రామ ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో"రామ రామ రామ ఉయ్యాలో... రామనే శ్రీరామ ఉయ్యాలో..." అంటూ ఈ పాటలో ప్రాంతీయ దేవుళ్లను కొలుస్తారు. ఈ పాటతో ప్రతి ఒక్కరూ దేవుళ్లను పూజిస్తూ ఆనందంగా ఉంటారు. ఈ పాటలన్నీ బతుకమ్మ సమయంలో ప్లే అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ పాటలు పాడుతూ.. బతుకమ్మను సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు.