LOADING...
Motivational: ఎప్పుడూ నిద్ర లేపకూడని 7 ప్రాణులు ఏమిటో తెలుసా??
ఎప్పుడూ నిద్ర లేపకూడని 7 ప్రాణులు ఏమిటో తెలుసా??

Motivational: ఎప్పుడూ నిద్ర లేపకూడని 7 ప్రాణులు ఏమిటో తెలుసా??

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాణిక్య నీతి సూత్రాలు శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఆయన చెప్పిన ప్రతీ సూత్రంలోనూ అనుభవం, వివేకం, లోతైన జ్ఞానం నిక్షిప్తమై ఉంటాయి. జీవితం సజావుగా సాగాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి అని ఆయన సూచించారు. వాటిలో ఒకటి - ఏడు రకాల ప్రాణులను నిద్ర లేపకూడదు అనే విషయం. ఆచార్య చాణిక్యుడు కేవలం గురువు మాత్రమే కాదు, సమాజ సంస్కర్తగానూ గుర్తింపు పొందినవారు. అపారమైన జ్ఞానాన్ని, జీవితానికి ఉపయోగపడే మార్గదర్శకాలను ప్రపంచానికి అందించారు. ఆయన బోధనల ప్రకారం, కొన్ని జీవులను నిద్రలో నుంచి మేల్కొలపడం మనకే ప్రమాదం తెచ్చిపెడుతుంది.

వివరాలు 

చాణిక్య సూత్రం: 

"అహిన్ నృపాణ్ చ శార్దూలం కితిన్ చ బాలకాన్ తత్।పార్శ్వానాం చ మూర్ఖం చ సప్త సుప్తాన్ బోధ్యాత్ ॥" ఈ శ్లోకం ప్రకారం.. పాము, రాజు, సింహం, చిరుతపులి, పసి పిల్లలు, ఇతరుల కుక్కలు, మూర్ఖులు. ఈ ఏడు రకాల ప్రాణులను ఎప్పుడూ నిద్రలేపకూడదు. అలా చేస్తే మనకే ప్రమాదం ఎక్కువ. 1. రాజు రాజును నిద్ర లేపితే అతనికి కోపం రావచ్చు. రాజు కోపం చాలా తీవ్రమైనది; అది మీ ప్రాణానికే హాని కలిగించవచ్చు. లేదా కఠిన శిక్ష విధించబడే అవకాశం ఉంటుంది.

వివరాలు 

2.సింహం 

నిద్రిస్తున్న సింహం లేదా విశ్రాంతిలో ఉన్న సింహాన్ని కలతపెట్టడం ప్రమాదకరం. అది కోపంతో దాడి చేసి ప్రాణాలను హరిస్తుంది. 3.పాము పాము ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుంటే దానికి ఆటంకం కలిగించకూడదు. ఒక్కసారి దాన్ని భంగపరిస్తే అది సమీపంలోని వారిని కరిచే ప్రమాదం ఉంది. 4. చిరుతపులి సింహంలాగానే చిరుతపులి కూడా నిద్రలో లేదా విశ్రాంతిలో ఉన్నప్పుడు తాకడం చాలా ప్రమాదకరం. అది వెంటనే ఆగ్రహించి దాడి చేయవచ్చు. 5.పసి పిల్లలు చిన్నపిల్లలు సగం నిద్ర నుంచి లేస్తే చిరాకు ఎక్కువగా ఉంటుంది. కారణం లేకపోయినా ఏడుస్తారు. వారిని సముదాయించడం కష్టమవుతుంది. అందువల్ల వారికి నిద్రాభంగం కలిగించరాదు.

వివరాలు 

6. కుక్క 

నిద్రలో ఉన్న కుక్కను లేపితే అది అసహనంతో ప్రవర్తించి కరిచే ప్రమాదం ఉంటుంది. ప్రత్యేకంగా అది మీది కాని కుక్క అయితే ఇంకా జాగ్రత్త అవసరం. 7. మూర్ఖుడు మూర్ఖుని నిద్ర లేపితే లేనిపోని గొడవలు మొదలవుతాయి. అలాంటి వారు నిద్ర లేవగానే లేపిన వ్యక్తిపైనే విరుచుకుపడతారు. అందువల్ల అవసరం ఉన్నా సరే వీరిని నిద్రలేపడం మంచిది కాదు. చాణిక్యుని సూచన ప్రకారం, ఈ ఏడు రకాల ప్రాణుల నిద్రాభంగం మనకే అనర్థాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఏట్టి పరిస్థితుల్లోనూ వీటిని నిద్ర లేపకూడదు.