Magnet Fishing: మాగ్నెట్ పళ్లెం తరహాలో.. మాగ్నెట్ ఫిషింగ్.. న్యూయార్క్ జంటకు నిధి లభ్యం
ఈ వార్తాకథనం ఏంటి
మాగ్నెట్ పళ్లెం అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు మన తెలుగు రాష్ట్రాలల్లో మహా క్రేజ్ వుండేది.
మాగ్నెట్ ఫిషింగ్ అంటే లోహ వస్తువులను తిరిగి పొందాలనే ఆశతో నీటిలో ఒక బలమైన అయస్కాంతంతో కూడిన తాడును వదలడం.
అదృష్టం బాగుంటే డాలర్లు వస్తాయి లేదంటే పోయేదేమీ లేదు కదా.
సరదాగా చెప్పాలంటే కొండకు వెంట్రుక ముడి వేసినట్లు. వస్తే కొండ లేదంటే పోయేది వెంట్రుకేకదా. ఇలాంటి ప్రయత్నమే ఒకటి చేసింది న్యూయార్క్ నగర జంట.
Details
మాగ్నెట్ ఫిషింగ్ ప్రయత్నంలో $100,000 నగదు ఉన్న నిధి
శుక్రవారం మధ్యాహ్నం క్వీన్స్‌లోని ఫ్లషింగ్ మెడోస్ కరోనా పార్క్‌లోని ఒక సరస్సులోకి దిగారు.
ఆ దంపతుల పేర్లు జేమ్స్ కేన్ , బార్బీ అగోస్టినీ . వారి కల ఫలించింది. సరస్సులో$100,000 నగదు ఉన్న సేఫ్‌ను బయటకు తీశారు.
నగదు, $100 బిల్లుల బండిల్స్‌కు $100,000విలువ వుండవచ్చని అంచనావేశారు. అయితే ఆ డబ్బు నీటిలో దెబ్బతిన్నది. ఈ జంట నిధి దక్కిన తర్వాత NY1కి ఇంటర్వ్యూ ఇచ్చింది.
Details
కోవిడ్ -19 మహమ్మారి తర్వాత నిధి-వేటపై పడిన జంట
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో పరికరాలపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా నిధి-వేటను ప్రారంభించామని వివరించారు.
ఈ అయస్కాంత ఆకర్షణ వల్ల పాత తుపాకులు, రెండవ ప్రపంచ యుద్ధం గ్రెనేడ్‌లు, బయటికి వచ్చాయన్నారు.
భారీ మోస్తరు పరిమాణంలో ఉన్న మోటార్‌సైకిల్, విదేశీ నాణేలు , ఆభరణాలతో సహా కనుగొన్న వాటిలో ఉన్నాయని ఈ జంట పేర్కొంది .
Details
యజమానిని గుర్తించలేమన్న న్యూయార్క్ పోలీసులు
తమకు ఇలాంటి అనుభవం ఎప్పుడూ చూడలేదని తెలిపింది.దీనిపై న్యూయార్క్ పోలీసులను సంప్రదించామని చెప్పారు.
అయితే నగదు దొరకడం ఎలాంటి నేరం కాదని, పోలీసులు చెప్పారని అగోస్టిని చెప్పాడు. నిధి అసలు యజమానిని గుర్తించడానికి మార్గం లేదని తమకు చెప్పారని వివరించారు.
దీనితో ఆ నిధిని యధాతధంగా ఉంచడానికి అనుమతించామని ఆ జంట చెప్పారు.