High Ironing Prices: నోయిడా vs బెంగళూరు: ఇస్త్రీ ధరల్లో భారీ తేడా.. నెటిజన్లు షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
నోయిడా నుంచి బెంగళూరుకు మారిన తర్వాత అక్కడి ఇస్త్రీ (ఇరానింగ్) ధరలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వెంచర్ క్యాపిటలిస్ట్ షాజిత్ పాయ్ సోషల్ మీడియాలో చెప్పిన విషయం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఇటీవల ఆయన బెంగళూరులోని ఇంద్రానగర్ ప్రాంతానికి మారినట్లు తెలిపారు. సాధారణంగా ఆహారం, ఇంధనం, యుటిలిటీ సేవలు వంటి అవసరాల ధరలు దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో, స్థానిక ధరల తేడాపై ఆయన చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా నోయిడా, బెంగళూరు మధ్య ఇస్త్రీ ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వివరాలు
బెంగళూరులో ధరలు చూసి షాక్..
తాను గతంలో నోయిడాలో ఒక్క జత బట్టలకు సుమారు రూ.5 చెల్లించేవాడినని, బెంగళూరులో కూడా కొంచెం ఎక్కువే ఉంటుందని అనుకున్నానని ఆయన తెలిపారు. అయితే బెంగుళూరులోని ఇంద్రానగర్ ప్రాంతంలో ఇస్త్రీ ఛార్జీలు రూ.12 నుంచి రూ.20 వరకు ఉండటంతో ఆశ్చర్యపోయానని చెప్పారు. "ఈ నెల ప్రారంభంలో నేను బెంగళూరుకు మారాను. ఇక్కడ నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయం ఇస్త్రీ ధరలే. నేను నోయిడాలో ఉండగా ఒక్క జత బట్టలకు రూ.5 చెల్లించేవాడిని. అది కొంచెం తక్కువే అని తెలుసు. కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటుందని అనుకున్నాను. కానీ ఇక్కడ రూ.12 నుంచి రూ.20 వరకు ఉండటం ఆశ్చర్యం కలిగించింది" అని ఆయన ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో పేర్కొన్నారు.
వివరాలు
ధరల పెరుగుదలకు కారణం అదేనా?
ముంబై నుంచి వచ్చినవారు కూడా బెంగళూరులో ఇస్త్రీ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇక్కడ ఇస్త్రీ వ్యాపారులు ఎక్కువగా ఎల్పీజీతో పనిచేసే ఇస్త్రీ పెట్టెలను వాడుతుండటంతో ఖర్చు పెరుగుతుందేమో అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. "ఇది ఒక కారణం కావచ్చు. అలాగే నోయిడా వంటి ప్రాంతాల్లో బొగ్గు (చార్కోల్) వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఖర్చులు తక్కువగా ఉంటాయా? నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ బెంగళూరులో ఇస్త్రీ ఖర్చు ఎక్కువగా ఉండటానికి కారణాలపై వివిధ అభిప్రాయాలు వినాలని ఉంది" అని ఆయన అన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్..
I moved early this month to BLR, and one of the most surprising findings was the higher cost of ironing. Noida where I prev stayed was ₹5 per piece which I know is a bit on the lower side, so I was expecting slighly higher prices but prices of ₹12-20 per piece (admittedly this… pic.twitter.com/3uoLwwSfNu
— Sajith Pai (@sajithpai) May 27, 2026