LOADING...
Republic Day 2026 : గణతంత్ర వేడుకల్లో పాక్ నేత..! భారత్-పాకిస్తాన్ చరిత్రలో అరుదైన ఘట్టం
గణతంత్ర వేడుకల్లో పాక్ నేత..! భారత్-పాకిస్తాన్ చరిత్రలో అరుదైన ఘట్టం

Republic Day 2026 : గణతంత్ర వేడుకల్లో పాక్ నేత..! భారత్-పాకిస్తాన్ చరిత్రలో అరుదైన ఘట్టం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 23, 2026
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026 జనవరి 26న భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనుంది. ప్రతేడాది ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖ నేతలను భారత్ ఆహ్వానించడం ఆనవాయితీ. కానీ ఒకప్పుడు శత్రుదేశంగా భావించే పాకిస్తాన్‌కు చెందిన నాయకుడినే గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా పిలిచిన సంఘటన చరిత్రలో చోటు చేసుకుంది. అది ఎప్పుడో తెలుసా? ప్రతి సంవత్సరం జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారత్ సంపూర్ణ గణతంత్ర దేశంగా అవతరించింది.

Details

విలువలను చాటిచాప్పేందుకు విదేశీ అతిథులకు అహ్వానం

ఈ సందర్భంగా అంతర్జాతీయంగా భారత్ తన ప్రజాస్వామ్య విలువలను చాటిచెప్పేందుకు విదేశీ అతిథులను ఆహ్వానిస్తూ వస్తోంది. దాదాపు 70 ఏళ్ల క్రితం భారత్-పాకిస్తాన్ సంబంధాలు నేటిలా తీవ్రంగా లేని సమయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 1955లో పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మాలిక్ గులాం మహమ్మద్‌ను భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. అప్పట్లో భారతదేశం తన ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేస్తూ, అంతర్జాతీయ వేదికపై తన స్థానాన్ని దృఢం చేసుకునే ప్రయత్నంలో ఉంది. మాలిక్ గులాం మహమ్మద్‌కు భారత్‌తో పాత అనుబంధం ఉండటమే ఈ ఆహ్వానానికి ఒక కారణంగా భావిస్తారు. అతను అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. బ్రిటిష్ పాలన కాలంలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేశాడు.

Details

నిజాం ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అనుభవం

అలాగే హైదరాబాద్ నిజాం ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా కూడా వ్యవహరించాడు. లియాఖత్ అలీ ఖాన్ హత్య అనంతరం 1951లో మాలిక్ గులాం మహమ్మద్ పాకిస్తాన్ గవర్నర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. అతని పదవీకాలంలో పాకిస్తాన్ రాజకీయ చరిత్రలో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. 1953లో ప్రధానమంత్రి ఖ్వాజా నజీముద్దీన్ ప్రభుత్వాన్ని ఆయన రద్దు చేశారు. 1954లో పాకిస్తాన్ రాజ్యాంగ సభను కూడా విరమింపజేశారు. ఈ చర్యలకు అప్పటి సీనియర్ సైనిక నాయకత్వం మద్దతు ఇచ్చింది. ఆ వర్గంలో తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడిగా మారిన జనరల్ అయూబ్ ఖాన్ కూడా ఉన్నారు. విభజన తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు తరచూ ఉద్రిక్తతలకు లోనవుతున్నప్పటికీ, 1955లో భారత్ ఈ ఆహ్వానం ఇచ్చింది.

Advertisement

Details

ముఖ్య అతిథిగా మాలిక్ గులాం మహ్మద్

ఆ ఏడాది రాజ్‌పథ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కవాతు (Rajpath Parade 1955)లో మాలిక్ గులాం మహమ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదే సంవత్సరంలో ప్రారంభమైన అనేక సంప్రదాయాలు, వేడుకల ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చరిత్రను వెనక్కి తిరిగి చూస్తే.. భారత్-పాకిస్తాన్ సంబంధాలు ఎప్పుడూ సులభంగా సాగలేదని ఈ సంఘటన స్పష్టంగా గుర్తు చేస్తుంది. ఒకప్పుడు శత్రుదేశానికి చెందిన నాయకుడిని గౌరవ అతిథిగా ఆహ్వానించడం, కొద్ది సంవత్సరాలకే అదే దేశంలో రాజకీయ తిరుగుబాట్లు చోటు చేసుకోవడం వంటి ఘటనలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న వైరుధ్యాలను చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి.

Advertisement