Joint Pains: వానాకాలంలో కీళ్లు నొప్పులు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!
ఈరోజుల్లో చాలామంది మోకాళ్లు, కీళ్ల నొప్పుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు లేస్తే కూర్చోలేు, కూర్చుంటే లేవలేరు. వర్షాకాలం ఈ నొప్పుల తీవ్రత మరింత పెరుగుతుంది. ఇక ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలను పాటిస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. శరీర బరువును అదుపులో ఉంచుకుంటే కీళ్ల నొప్పుల నుండి తప్పించుకోవచ్చు. వానాకాలంలో శరీర బరువును పెరగకుండా చూసుకోవడం మంచింది. ఆర్థరైటిస్ నొప్పితో బాధపడేవారు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. లేకపోతే నొప్పులు పెరిగే ఛాన్స్ ఉంది. కావున ప్రతిరోజు వ్యాయామంతో పాటు మోగాసానాలు చేయడం ముఖ్యం
వానాకాలంలో నీటిని ఎక్కువగా తీసుకోవాలి
వానాకాలంలో శరీరాన్ని ప్రతిరోజూ హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. వానాకాలంలో ప్రతిరోజు నీటిని ఎక్కువ తీసుకోవాలి. అంతేకాకుండా యాపిల్, నారింజ జ్యూస్ లను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు ఉన్నవారు శరీరానికి వేడిని అందించాల్సి ఉంటుంది. లేకపోతే తేమ కారణంగా నొప్పులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వారు అతిగా శరీర శ్రమ కూడా చేయకూడదు. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు వానాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. తీసుకొనే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.