LOADING...
Papaya Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయి అస్సలు తినకూడదు
ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయి అస్సలు తినకూడదు

Papaya Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయి అస్సలు తినకూడదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2025
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

సీజన్‌తో సంబంధం లేకుండా దొరికే పండ్లలో బొప్పాయి (Papaya) ఒకటి. పసుపు రంగులో మెరిసే ఈ పండు తియ్యని రుచితో పాటు ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ A, C, E, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి మేలు చేసి, ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయినా సరే.. అందరికీ ఇది అనుకూలం కాదు. కొందరికి బొప్పాయి తినడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఈ 5 పరిస్థితుల్లో ఉన్నవారు బొప్పాయి తినకపోవడం మంచిది.

Details

 1. గర్భిణులు 

గర్భధారణ సమయంలో పండని లేదా సగం పండిన బొప్పాయి తినకూడదు. ఎందుకంటే ఇందులో లేటెక్స్‌, పపైన్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి గర్భాశయ సంకోచాలకు దారితీసి, అకాల ప్రసవానికి లేదా ఇతర సమస్యలకు కారణమవుతాయి. అందువల్ల వైద్యులు సాధారణంగా గర్భిణీ స్త్రీలకు బొప్పాయి పూర్తిగా దూరంగా ఉంచమని సూచిస్తారు. 2. గుండె సంబంధిత సమస్యలున్నవారు బొప్పాయిలో లైకోపిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తనాళాలను రక్షించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాక, బొప్పాయిలోని ఫైబర్‌ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సాయపడుతుంది. క్రమం తప్పకుండా తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందువల్ల గుండె సమస్యలున్నవారు డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.

Details

 3. లేటెక్స్ అలర్జీ ఉన్నవారు

బొప్పాయిలోని కొన్ని ప్రోటీన్లు లేటెక్స్ ప్రోటీన్లకు దగ్గరగా ఉంటాయి. అలర్జీ ఉన్నవారు తింటే దురద, తుమ్ములు, శ్వాసలో ఇబ్బంది, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక లేటెక్స్ అలర్జీ ఉన్నవారు డాక్టర్ అనుమతి లేకుండా బొప్పాయి తినకూడదు. 4. థైరాయిడ్ సమస్యలున్నవారు బొప్పాయిలో ఉండే ఫైటోకెమికల్స్‌ థైరాయిడ్ హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపవచ్చు. ఆరోగ్యవంతులపై పెద్దగా ప్రభావం లేకపోయినా, థైరాయిడ్‌ సమస్యలున్నవారు ఎక్కువగా తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Details

5. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు

బొప్పాయి విటమిన్ C మరియు మినరల్స్‌లో సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ C ఇమ్యూనిటీ పెంచడం, చర్మం, కంటి ఆరోగ్యం, జీర్ణవ్యవస్థకు ఉపయోగపడుతుంది. కానీ, కిడ్నీ రాళ్ల సమస్యలున్నవారికి ఇది కొంత ప్రమాదకరం. అధిక విటమిన్ C వల్ల శరీరంలో ఆక్సలేట్ పదార్థాలు పెరిగి, కాల్షియంతో కలిసినప్పుడు కిడ్నీలో రాళ్లుగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే కిడ్నీ రాళ్లు ఉన్నవారు, కిడ్నీ పనితీరు మందగించినవారు లేదా కాల్షియం-ఆక్సలేట్ రాళ్లకు రిస్క్ ఉన్నవారు బొప్పాయి ఎక్కువగా తినకూడదు. తిన్నా కూడా చిన్న ముక్కలుగా, రోజుకు ఒక్కసారి మాత్రమే తినడం మంచిది. తిన్న తర్వాత తగినంత నీరు తాగడం ద్వారా ఆక్సలేట్లు బయటకు వెళ్ళేలా చూడాలి.