పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్: గుండెపోటుకు దారి తీసే ఈ వ్యాధి గురించి తెలుసుకోండి
పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (PAD).. ఈ వ్యాధి గుండెపోటుకు దారితీస్తుంది. సాధారణంగా ఆఫ్రికన్ అమెరికన్లలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. పురుషులు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడతారు. ముఖ్యంగా పొగ తాగే వారిలో ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈ వ్యాధి లక్షణాలు దీనికి కారణాలు, చికిత్స తెలుసుకుందాం. PAD అంటే ధమనుల్లో రక్తం గడ్డ కట్టుకుపోయి కాళ్లు, చేతులకు ప్రసరించే రక్త ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ పరిస్థితిలో కాళ్లలో రక్త ప్రసరణ సరిగ్గా జరగక కాళ్ల నొప్పులు, సరిగా నడవలేకపోవడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. చాలామందిలో ఈ వ్యాధి లక్షణాలు అంత తొందరగా కనిపించవు.
PAD లక్షణాలు, కారణాలు
లక్షణాలు జుట్టు రాలిపోవడం, కాళ్ళు, పాదాలు, తొడ భాగాల్లో నొప్పులు ఉంటాయి. నడిచేటప్పుడు, మెట్ల ఎక్కేటప్పుడు ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. తిమ్మిర్లు కూడా వస్తాయి. ఈ వ్యాధి కారణంగా కాలి వేలి గోర్లు నెమ్మదిగా పెరుగుతాయి. అలాగే గోర్లు ఆరోగ్యవంతంగా ఉండక విరిగిపోయినట్టుగా కనిపిస్తాయి. పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ఉంటాయి. కారణాలు ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. కొవ్వు పేరుకుంటున్న కొద్దీ రక్తం ప్రవహించే ధమనుల మార్గాలు సన్నగా మారిపోతాయి. దీనివల్ల రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడతాయి. డయాబెటిస్, పొగ తాగడం, ఊబకాయం, హైబీపీ, హై కొలెస్ట్రాల్, కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధ వ్యాధులు ఉండడం మొదలగు కారణాల వల్ల PAD వచ్చే అవకాశం ఉంది.
PAD రాకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు
ముందుగా పొగ తాగడం మానేయాలి. పొగ తాగని వారిలో కంటే పొగ తాగే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. బీపీ, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఒకవేళ మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే రక్తంలో చక్కెర శాతం పెరగకుండా చూసుకోవాలి. శరీరానికి పోషణ అందించే ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. చికిత్స ఈ వ్యాధికి రకరకాల చికిత్సా సౌకర్యాలు ఉన్నాయి ఆంజియో ప్లాస్టిక్ అనే చికిత్స ద్వారా ఒక సన్నని గొట్టాన్ని ధమనుల గోడల్లోకి పంపి పేరుకున్న కొవ్వుని తొలగించేస్తారు. ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటే బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ చేస్తారు.