LOADING...
Pink Forest: పాడేరులో 'పింక్ ఫారెస్ట్'.. ఉత్తరాంధ్రలో కొత్త పర్యాటక ఆకర్షణ
పాడేరులో 'పింక్ ఫారెస్ట్'.. ఉత్తరాంధ్రలో కొత్త పర్యాటక ఆకర్షణ

Pink Forest: పాడేరులో 'పింక్ ఫారెస్ట్'.. ఉత్తరాంధ్రలో కొత్త పర్యాటక ఆకర్షణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2025
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ప్రాంతంలో కొత్త పర్యాటక ఆకర్షణగా 'పింక్ ఫారెస్ట్'ఉంది. అక్కడ ఉన్న ప్రత్యేకమైన ఉప్ప చెట్ల వనాన్ని ఇప్పుడు 'పింక్ ఫారెస్ట్' అని పిలుస్తున్నారు. కేవలం 16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం తన వింత స్వభావంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. పింక్ ఫారెస్ట్ ప్రత్యేకత ఈ ఉప్ప చెట్లు మూడు నెలల వ్యవధిలో ఆరు రంగులు మార్చడం విశేషం. జనవరి నుండి మార్చి వరకు ఆకులు పసుపు, ఎరుపు, గులాబీ (పింక్) రంగులుగా మారుతూ, చివరకు ఆకుపచ్చ నుంచి తెల్లగా మారుతాయి. ఈ ప్రత్యేకతతోనే పాడేరులో ఈ ప్రాంతాన్ని 'పింక్ ఫారెస్ట్'గా పిలుస్తున్నారు.

Details

చరిత్ర, పుట్టుక 

ఈ చెట్లను ఒడిశాలోని జైపుర్ మహారాజు విక్రమ్ దేవ్ వర్మ హిమాలయ ప్రాంతాల నుంచి తెచ్చి పాడేరులో నాటించినట్లు తెలుస్తోంది. శీతల వాతావరణం, సారవంతమైన నేల కారణంగా ఇవి ఇక్కడ మాత్రమే పెరిగాయి. ఆధ్యాత్మికత, గిరిజనుల విశ్వాసం స్థానిక గిరిజన తెగలు ఈ చెట్లను అమ్మవారి రూపంగా భావిస్తారు. ఉప్ప చెట్ల తోటల్లో గుణాలమ్మ దేవాలయం ఉండటం, చెట్లకు ఎలాంటి హాని తలపెట్టరన్న నిబద్ధత గిరిజనుల భక్తిని తెలియజేస్తుంది. శాస్త్రీయ పరిశోధనలు ఈ చెట్లకు శాస్త్రీయ నామం మెసువా ఫెర్రియా. 2003లో ఏయూ బోటనీ విభాగం వీటిపై పరిశోధనలు ప్రారంభించింది. ఉప్ప చెట్ల కాయల నుంచి నూనె వస్తుందని, దీన్ని ప్రాచీన కాలంలో దీపాలను వెలిగించేందుకు ఉపయోగించేవారని వృక్ష నిపుణులు పేర్కొన్నారు.

Details

పర్యాటకంగా అభివృద్ధి

ఇటీవల సోషల్ మీడియాలో పింక్ ఫారెస్ట్ వీడియోలు వైరల్ కావడంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చే యోచనలో అధికారులు ఉన్నారు. నగరాల్లో విస్తరణ సాధ్యమా? పాడేరు వాతావరణంలో మాత్రమే ఈ చెట్లు సజీవంగా పెరుగుతున్నాయి. అరకులోని పద్మాపురం గార్డెన్‌లో నాటిన 20 వేల మొక్కల్లో కేవలం రెండు మాత్రమే పెరిగాయని తెలుస్తోంది. సందర్శకుల ముచ్చట్లు పింక్ ఫారెస్ట్ ప్రశాంతత, వాసనలు, రంగుల మార్పు - అన్నీ కలిపి ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తున్నాయని సందర్శకులు అంటున్నారు. ఈ ప్రాంతాన్ని మరింత ప్రాచుర్యంలోకి తేవాలన్నది స్థానికుల అభిమతం. ఈ ప్రకృతి అందం, శాస్త్రీయ విశేషాలతో పింక్ ఫారెస్ట్ ఇప్పుడే పర్యాటక కేంద్రంగా మారుతోంది.