మొక్కల నుండి వచ్చే ప్రోటీన్లు మీ శరీరానికి అందాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకోండి.
శరీర కండరాలను, కణజాలాలను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రోటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఐతే ఎక్కువ శాతం ప్రోటీన్లు మాంసాహారంలోనే ఉంటాయి. వెజ్ తినేవారికి ప్రోటీన్ల కొరత ఉంటుంది. ఆ కొరత లేకుండా చేయడానికి వెజ్ తినేవారు ఎలాంటి ఆహారాలు తీసుకుంటే బాగుంటుందో ఇక్కడ తెలుసుకుందాం. గింజలు: రోజువారి ఆహారంలో గింజలను చేర్చుకోవడం మంచి ఆరోగ్యకరమైన అలవాటు. బాదం, కాజు, పిస్తా, వాల్నట్, హాజెల్నట్ మొదలగు వాటిల్లో కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది. అంతేకాదు ఫైబర్, విటమిన్-E ఉంటాయి. వేరుశనగలు, పప్పులు: వేరుశనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్ వేరుశనగల్లో 7. 25గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చిక్కుళ్ళు, పప్పుల్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది.
ప్రోటీన్ అధికంగా ఉండే సోయా, ఓట్స్
సోయా: సోయామిల్క్, సోయా బీన్, టోఫు వంటి ఆహారాల్లో అమైనో ఆమ్లాలు ఉంటాయి. అంతేకాదు వీటిల్లో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ. ఒక కప్పు టోఫులో, 10గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సోయా అహారాల్లో ప్రోటీన్ మాత్రమే కాదు కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. శరీరానికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఓట్స్: ఓట్స్ ని చాలా సులభంగా వండుకోవచ్చు. రోజు వారి ఆహారంలో వివిధ రకాల పద్దతుల్లో ఓట్స్ ని ఆహారంగా తీసుకోవచ్చు. అరకప్పు ఓట్స్ లో 6గ్రాముల ప్రోటీన్, 4గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఓట్స్ తినడం వల్ల శరీరానికి మంచి పోషణ అందుతుంది. కొవ్వు పెరగడాన్ని, రక్తంలో చెక్క్ర స్థాయిలు పెరగడాన్ని ఓట్స్ లోని పోషకాలు తగ్గించేస్తాయి.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి