
Nagula Chavithi Prasadam: ఐదు నిమిషాల్లో ప్రిపేర్ అయ్యే నాగుల చవితి ప్రసాదాలు
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి అమావాస్య ముగిసాక, కార్తీక శుద్ధ చతుర్థినాడు నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.
దీపావళి తర్వాత వచ్చే ముఖ్యమైన పండగల్లో ఇది ఒకటి. పవిత్రమైన కార్తీక మాసంలో జరుగుతున్న నాగుల చవితి పండుగను, సుబ్రమణ్య స్వామిని ఆరాధించే భక్తులు వైభవంగా నిర్వహిస్తారు.
నాగుల నుండి రక్షణ కల్పించమని సుబ్రమణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తారు. పురాణాలలో నాగులకు ఎంతో ప్రాధాన్యత ఉంది, అందువల్ల నాగుల చవితి రోజు పూజ చేసి, ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
నాగేంద్రుడికి చలిమిడి, నువ్వులతో చేసిన చిమ్మిలి ప్రసాదాలు ప్రత్యేకంగా వేస్తారు. ఈ రెసిపీలను సులభంగా ఎలా చెయ్యచో ఇప్పుడు చూద్దాం..
వివరాలు
చలిమిడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బియ్యప్పిండి - 1 కప్పు
నెయ్యి - 1 స్పూను
యాలకుల పొడి - చిటికెడు
బెల్లం తురుము - ½ కప్పు
చలిమిడి తయారీ విధానం
కొందరు తడి బియ్యప్పిండితో చలిమిడిని తయారు చేస్తారు.
బియ్యాన్ని కడిగి మెత్తగా పొడి చేసి, తడిగా ఉన్నప్పుడు వండాలి.
వీలుకాని వారు నేరుగా బియ్యప్పిండితో వండవచ్చు.
మిక్సీ జార్‌లో బియ్యప్పిండి, బెల్లం, యాలకుల పొడి, మరియు నెయ్యిని వేసి బాగా రుబ్బాలి.
మిశ్రమం గట్టిగా అయితే, అవసరమైతే కొంచెం పాలు జోడించవచ్చు.
మిశ్రమం బాగా కలసేలా రుబ్బాలి.
తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తేవాలి.
చలిమిడి తయారైంది.
కొబ్బరి తురుము కూడా కలపవచ్చు.
దీన్ని చిన్న ఉండలుగా చేసుకుని పక్కన ఉంచండి.
వివరాలు
నువ్వుల చిమ్మిలి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
నువ్వులు - 1 కప్పు
బెల్లం తురుము - ½ కప్పు
నువ్వుల చిమ్మిలి తయారీ విధానం
ఈ రెసిపీ చాలా సులభం.
నువ్వులను మిక్సీ జార్‌లో వేసి, బెల్లం తురుము జోడించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
కావాలనుకుంటే, 1-2 స్పూన్ల పాలు జోడించవచ్చు.
ఇది ముద్దగా మారుతుంది. వీటిని లడ్డూల్లా చుట్టుకొని చిమ్మలిని తయారు చేసుకోవాలి.
చిన్న ఉండలుగా చేసి, నాగేంద్రుడికి పుట్టలో వేసి ప్రసాదంగా సమర్పిస్తారు.
చలిమిడి, చిమ్మిలి రెండూ ఆరోగ్యానికి మేలు చేసే ద్రవ్యాలు. నాగేంద్రుడికి పూజ చేసిన తరువాత వీటిని ప్రసాదంగా తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.