Rajasthan : 350 ఏళ్లుగా ఈ ఆలయంలో ప్రసాదం దోపిడీ.. కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో ఆచారాలు ఆసక్తికరంగా ఉంటాయి. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లో ఉన్న శ్రీనాథ్‌జీ ఆలయంలో అన్నకూట్ పండుగ జరుగుతుంది. దాదాపుగా 350 ఏళ్లుగా ఇక్కడి ప్రసాదాన్ని లూటీ చేయటం ఆచారంగా వస్తోంది. శ్రీనాథ్ జీకి భక్తులు ప్రసాదాలు పెట్టడం, గిరిజనులు గుంపులుగా లూటీ చేయటం సాంప్రదాయం. 350 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. ఇక్కడ దేవుడికి సమర్పించే ప్రసాదం అన్నకూట్ ను గిరిజనులు లూటీ చేయటం ఆనవాయితీగా వస్తోంది.అన్నకూట్ ప్రసాదాన్ని లూటీ చేసేందుకు భక్తులు దేశవ్యాప్తంగా ఈ ఆలయానికి చేరుకుంటారు.
దీపావళి తర్వాతి రోజున ఘనంగా ప్రసాదం లూటీ పండుగ
ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, జాతరలు, సంబురాల్లో దేవుళ్లకు పెట్టే ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచుతుంటారు. ప్రసాదాన్ని లూటీ చేసే పండుగను రాజ్‌సమంద్ వాసులు దీపావళి తర్వాతి రోజు ఘనంగా నిర్వహించుకుంటారు. శ్రీనాథ్‌జీ, విఠల్‌నాథ్‌జీ, లాలన్‌కు భక్తులు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తుంటారు. ఆ ప్రసాదాలను రాత్రి 11 గంటల సమయంలో గిరిజనులు వచ్చి దోచుకుంటారు. ఈ నైవేద్యాలను లూటీ చేసి పట్టుకెళితే వారికి సమస్త రోగాలు నయమవుతాయని గిరిజన వాసులు విశ్వసిస్తారు. అయితే భక్త జనులు భారీగా తరలివచ్చి ప్రసాదాలను ఎవరికి తోచింది వారు పట్టుకెళ్తారు. ఈ లూటీని ఎవరూ అడ్డుకోకపోవడం కొసమెరుపు. ఈ నేపథ్యంలోనే గిరిజన భక్తులతో దేవాలయంప్రాంగణం అంతా జనసందోహంగా మారుతుంది.