Ramadan Mubarak 2025: రంజాన్ ముబారక్! మీ ప్రియమైనవారికి ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు పంపండి!
ఈ వార్తాకథనం ఏంటి
ముస్లిములకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర మాసాన్ని గడుపుతున్నారు.
రంజాన్ మాస ప్రారంభం అంటే సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమిచ్చి, ఈ పవిత్ర పర్వదినాన్ని ప్రకటించినట్లుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, సమాజసేవ ద్వారా రంజాన్‌ను సార్థకం చేసుకుంటారు.
మీరు కూడా ఈ పవిత్ర మాసాన్ని మరింత ఆనందంగా గడిపేందుకు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.
మీ కోసం కొన్ని ఉత్తమమైన సందేశాలు ఇవే
Details
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సందేశాలు
1.ఈ పవిత్ర రంజాన్ మాసం అందరికీ శాంతి, ప్రేమ, సామరస్యం తీసుకురావాలని కోరుకుంటున్నాను.
2. రంజాన్ సందర్భంగా అల్లాహ్ ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబానికి కలగాలి. ఆరోగ్యం, శ్రేయస్సు, ప్రశాంతత కలగాలని ఆకాంక్షిస్తున్నాను.
3. ఈ రంజాన్ మీ జీవితంలో వెలుగు, ప్రేమ, సామరస్యాన్ని నింపాలి. మీకు, మీ ప్రియమైన వారికి ఆశీర్వాద మాసం కావాలని కోరుకుంటున్నాను.
4. ఉపవాస దీక్షలు, ప్రార్థనల ద్వారా మన జీవితాలు మరింత పవిత్రంగా మారాలని, విజయానికి మార్గం సుగమం అవుతుందని ఆకాంక్షిస్తున్నాను.
5. ఈ పవిత్ర మాసంలో మీరు శక్తిని, సహనాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. మీ విశ్వాసం రోజురోజుకూ బలపడాలి. హ్యాపీ రంజాన్
Details
ఈ ప్రత్యేక సందేశాలను మీ స్నేహితులతో పంచుకోండి
6. ఈ రంజాన్ మాసం మీ జీవితాన్ని శ్రేయస్సుతో నింపాలని, విశ్వాసంతో నడిపించాలని కోరుకుంటున్నాను. రంజాన్ శుభాకాంక్షలు!
7. మీరు ఉపవాసం ఉండి ప్రార్ధిస్తున్నప్పుడు, అల్లాహ్ తన కరుణను మీపై కురిపించి మిమ్మల్ని సన్మార్గంలో నడిపించాలి.
8. భక్తి, ఆనందం, ఐక్యతతో నిండిన రంజాన్ శుభాకాంక్షలు. మీ ప్రార్థనలకు సమాధానం లభించాలి! మీ జీవితాలు సంతోషంతో నిండాలని కోరుకుంటున్నాను.
9. మీ ఉపవాసాలు సులభంగా ఉండాలని, మీ ప్రార్థనలు స్వీకరించాలని, మీ హృదయం విశ్వాసంతో నిండి ఉండాలని ఆశిస్తూ.. హ్యాపీ రంజాన్
10. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మీ ప్రార్థనలు శక్తివంతంగా ఉండి, మీ విశ్వాసం బలపడాలని ఆకాంక్షిస్తున్నాను.