LOADING...
Ramadan Special: రంజాన్ స్పెషల్ ఆంధ్రా మసాలా గంజి.. రుచి చూస్తే మైమరచిపోవాల్సిందే!
రంజాన్ స్పెషల్ ఆంధ్రా మసాలా గంజి.. రుచి చూస్తే మైమరచిపోవాల్సిందే!

Ramadan Special: రంజాన్ స్పెషల్ ఆంధ్రా మసాలా గంజి.. రుచి చూస్తే మైమరచిపోవాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2026
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ పవిత్ర నెలలో ఎంతోమంది భక్తులు ఉపవాసం పాటిస్తారు. రోజంతా నిరాహార దీక్ష అనంతరం ఇఫ్తార్ సమయంలో సాధారణంగా ఖర్జూరాలు, పండ్లు, హలీం వంటి వంటకాలను తీసుకుంటారు. అయితే రంజాన్ ప్రత్యేకతను మరింత పెంచే మరో సంప్రదాయ వంటకం కూడా ఉంది. అదే గంజి. ఉపవాస విరమణ సమయంలో తీసుకునే ఈ గంజి అత్యంత పోషకవంతమైనది, తేలికగా అరిగేదిగా ఉండి శరీరానికి తక్షణ శక్తిని, అవసరమైన హైడ్రేషన్‌ను అందిస్తుంది. ముఖ్యంగా బొంబాయి రవ్వ, అల్లం-వెల్లుల్లితో తయారుచేసే ఈ ఆంధ్రా స్టైల్ గంజి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రంజాన్ నెలలో ఇఫ్తార్ సమయంలో గంజి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

Details

తయారీ విధానం

ఉపవాసం చేసిన వారికి ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రుచిలోనూ అద్భుత అనుభూతిని ఇస్తుంది. బూందీతో కలిపి సర్వ్ చేస్తే రుచి మరింత పెరుగుతుంది. ఎన్నో పోషకాలతో కూడిన ఆంధ్రా స్టైల్ మసాలా గంజిని ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పెద్ద పాత్రను స్టవ్ మీద పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి ఇష్టం లేనివారు నూనె ఉపయోగించవచ్చు. నెయ్యి వేడయ్యాక నాలుగు లవంగాలు, రెండు లేదా మూడు చిన్న దాల్చిన చెక్క ముక్కలు, చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక బిర్యానీ ఆకు వేసి రెండు నిమిషాలు దోరగా వేయించాలి.

Details

రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి

సుగంధ ద్రవ్యాలు వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల సన్నగా, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న ముక్కలుగా తరిగిన ఒక పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలను చేర్చి బాగా కలపాలి. మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచి ఉల్లిపాయ, క్యారెట్ మగ్గేలా చూడాలి. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు సుమారు రెండు నిమిషాలు వేయించాలి. ఆపై సన్నగా తరిగిన కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసి వెంటనే ఒక టీ స్పూన్ ఉప్పు చేర్చాలి.

Advertisement

Details

ఉంటలు కట్టకుండా జాగ్రత్త పడాలి

ఉప్పు వేయడం వల్ల టమాటో త్వరగా మెత్తబడుతుంది. అన్నింటిని బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించాలి. టమాటో పూర్తిగా మెత్తబడిన తర్వాత ఒకటిన్నర లీటర్ల నీరు పోసి మూత పెట్టి హై ఫ్లేమ్‌లో బాగా మరిగించాలి. నీరు మరిగేటప్పుడు రుచి చూసి ఉప్పు సరిపోకపోతే సర్దుబాటు చేసుకోవాలి. నీరు బాగా మరిగిన తర్వాత సుమారు 100 గ్రాముల బొంబాయి రవ్వను నెమ్మదిగా కలుపుతూ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా పోయాలి. రవ్వ వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో మరో రెండు నుంచి మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుంది. గంజి పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత అది చిక్కబడుతుంది.

Advertisement

Details

ఇలా చేస్తే రెడీ

ఇలా ఎంతో సులభంగా తయారయ్యే ఆంధ్రా స్టైల్ మసాలా గంజి రంజాన్ ఇఫ్తార్‌కు అద్భుతమైన వంటకం. వేడివేడిగా బూందీతో కలిపి సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది. ఈ గంజిని ఎవరైనా సులభంగా ఇంట్లోనే తయారుచేసుకుని ఆస్వాదించవచ్చు. ఆరోగ్యకరంగా, రుచికరంగా ఉండే ఈ వంటకం రంజాన్ సమయంలో తప్పక ప్రయత్నించాల్సిందే.

Advertisement