
Puligundala forest: పులిగుండాల అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి జాతులు..
ఈ వార్తాకథనం ఏంటి
పులిగుండాల అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి జాతులు కనపడినట్లు వన్యప్రాణి నిపుణులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం పల్లెర్లబావి గుట్ట నుంచి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాల వరకు విస్తరించిన అటవీ ప్రాంతంలో వన్యప్రాణి నిపుణులు ఆదివారం 'నేచర్ వాక్' కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈశాన్య భారతదేశం,ఆగ్నేయాసియా ప్రాంతాలలో నివసించే 'ప్లమ్-హెడెడ్ పారకీట్' అనే చిలుక స్థానిక అడవిలో సంచరిస్తున్నట్లు వారు చెప్పారు.
అలాగే, ఆసియా, ఆఫ్రికా అడవులలో నివసించే షిక్రా పక్షి, ఆఫ్రికా, ఆసియా,ఇతర అనేక ద్వీపాల్లో వుంటున్న మోనార్కిడే కుటుంబానికి చెందిన ప్యారడైజ్ ఫ్లైక్యాచర్ పక్షులు కూడా కనిపించాయి.
వివరాలు
అడవిలో ఇతర పక్షి జాతులు
తెలంగాణలో ఈ పక్షులు మొదటిసారిగా పులిగుండాల అడవిలో కనిపించినట్లు వారు స్పష్టం చేశారు.
ఇతర పక్షి జాతులను కూడా గుర్తించామని వారు చెప్పారు.
ఈ కార్యక్రమంలో వన్యప్రాణి నిపుణులు జెట్టీ రమేశ్, ప్రదీప్, నవీన్, సుజీత్, శ్రావణ్, హరికృష్ణ, పూజితలతోపాటు ఫారెస్ట్ డివిజనల్ అధికారి వి.మంజుల, రేంజ్ ఆఫీసర్ ఉమా, డీఆర్వో రాంసింగ్, సురేశ్‌కుమార్ మరియు ఇతరులు పాల్గొన్నారు.