Araku Coffee: అరకులో పండే అరుదైన 'కాఫీ'.. రుచి, పరిమళంలో అద్భుతం!
ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రేమికులకు ఏకమైన మధుర అనుభూతిని ఇచ్చేది 'అరకు కాఫీ'. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మన కీ బాత్ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా ఈ కాఫీపై ఆసక్తి మరింత పెరిగింది. కాఫీ తాగేవారికి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే అరకు కాఫీ గురించి మనం మరిన్ని వివరాలను తెలుసుకుందాం. విశాఖపట్నం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకులోయలో, తూర్పు కనుమల అందాల మధ్య ఈ కాఫీ సాగుతుంది. 20-30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, తక్కువ ఎండలు, అందమైన వాతావరణం కాఫీ పంట పెరగటానికి ఎంతో అనుకూలంగా ఉంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా అరుకు కాఫీ గుర్తింపు
ఇక్కడ పండే కాఫీకి అంతర్జాతీయ స్థాయి రుచి, పరిమళం ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ కాఫీ 'టెర్రాయిర్ మ్యాపింగ్' పద్ధతిలో సాగవుతోంది, అంటే ప్రత్యేకమైన వాతావరణం, నేల స్వరూపాన్ని అనుసరించి సాగుదల అవుతుంది. పురుగు మందులు, రసాయనాలు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో వాటిని సాగుచేస్తారు. సాధారణ కాఫీలకు వచ్చే రేటింగ్ 80 పాయింట్ల వరకు ఉంటే, అరకు కాఫీకి 90 పాయింట్లు రావడం దాని ప్రత్యేకతను మరింత చాటి చెబుతోంది. అరకు కాఫీ ఎర్లీ హార్వెస్ట్, సెలెక్షన్, గ్రాండ్ రిజర్వ్ మూడు రకాలుగా ఉంటుంది. ఒక్కొక్క రకం ప్రత్యేక రుచి, మాన్హైనతలతో కాఫీ ప్రేమికులను ఆకట్టుకుంటోంది.
ఆన్ లైన్ ద్వారా బుకింగ్
ఈ కాఫీ గింజలు మొత్తం పదిసార్లు సేకరించి, చెర్రీలు పండినపుడు మాత్రమే సేకరించడం వల్ల తాజాదనాన్ని కోల్పోకుండా ఉంచుతారు. ఈ కాఫీ పంటను ప్రాథమికంగా గిరిజనులే సాగుచేస్తున్నారు. మద్యవర్తులు లేకుండా నేరుగా వారే లాభాలు పొందేలా ఉండటం వల్ల వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబన ఏర్పడుతోంది. ఎమర్జింగ్ గ్లోబల్ బ్రాండ్‌గా మారిన ఈ కాఫీ, ఇండియాకు గర్వకారణంగా నిలిచింది. ఈ కాఫీని arakucoffee.in, https://www.arakucoffee.in వెబ్‌సైట్ ద్వారా, అమెజాన్ లాంటి ఈ-కామర్స్ సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. తీపి, పండ్ల రుచి, పువ్వుల పరిమళం కలిగిన అరకు కాఫీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా మారింది. రు.