రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి: ఆయన రచనల్లో తప్పకుండా చదవాల్సిన పుస్తకాలు
భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే సాహిత్య విభాగంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి అందుకున్న గొప్ప సాహిత్యకారుడు రవీంద్ర నాథ్ ఠాగూర్. 1861సంవత్సరంలో మే 7వ తేదీన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జన్మించిన ఠాగూర్, చిన్నప్పటి నుండి సాహిత్యం మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన కలం నుండి వచ్చిన అద్భుతమైన రచనల గురించి తెలుసుకదాం. గీతాంజలి: ఈ రచనకు 1913లో నోబెల్ బహుమతి అందుకున్నాడు ఠాగూర్. ఇది కవితా సంకలనం. 157కవితలు ఇందులో ఉన్నాయి. జనారణ్యంలో బాగా నలిగిన, ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో.. ఆ స్వేఛ్ఛా స్వర్గానికి నా దేశాన్ని మేల్కొలుపు అనే కవిత ఈ పుస్తకంలోనిదే.
మూడు పాత్రల మధ్య సంఘర్షణ తెలియజేసే పుస్తకం
ఘరే బైరే (ద హోమ్ అమ్డ్ ద వరల్డ్): స్వాతంత్రోద్యమ కాలంలోని స్వదేశీ ఉద్యమం సమయానికి చెందిన కథ ఇది. ఇందులో ప్రేమ, రాజకీయాలు, పోరాటాలు ఉంటాయి. మూడు పాత్రల మధ్య సంఘర్షణ ఈ రచనలో కనిపిస్తుంది. ద పోస్ట్ మాస్టర్: రవీంద్ర నాథ్ సాహిత్యాన్ని ఇప్పటివరకు మొదలు పెట్టనివారు ఈ పుస్తకంతో మొదలు పెట్టవచ్చు. యువకుడైన పోస్ట్ మాస్టర్, ఒంటరితనం అనుభవించే రతన్ అనే అనాధ అమ్మాయి చుట్టూ తిరిగే కథ. ఛోకేర్ బాలి: వినోదిని అనే వితంతువు, మాహీమ్, ఆషాల వివాహ బంధాన్ని చూసి అసూయ పడుతుంది. దానివల్ల ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నదో తెలియజేస్తుంది ఈ పుస్తకం.