పుస్తకాలు; స్యూ గ్రాఫ్టన్ రచించిన ఆల్ఫాబెట్ సిరీస్ లోని అద్భుతమైన పుస్తకాలు
స్యూ గ్రాఫ్టన్.. అమెరికాకు చెందిన డిటెక్టివ్ నవలా రచయిత్రి. ఆల్ఫాబెట్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోని A నుండి Y వరకు మొత్తం 25పుస్తకాలు రాసారు. ఆల్ఫాబెట్ సిరీస్ లోని కొన్ని పుస్తకాల గురించి మాట్లాడుకుందాం. A ఈజ్ ఫర్ ఆలిబి: ఆల్ఫాబెట్ సిరీస్ లోని మొదటి పుస్తకం ఇదే. వరుస హత్యలు ఇందులో ప్రధానాంశంగా ఉంటుంది. కిన్సో మిల్ హోన్ అనే శక్తివంతమైన పాత్ర ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ఒక వింత ప్రాంతంలో జరిగే ఈ కథ, అడుగడుగునా సస్పెన్స్ తో కూడి ఉంటుంది. F ఈజ్ ఫర్ ఫుజిటివ్: హత్యానేరంలో ఇరుక్కున్న పాత్రను బయటపడేయడానికి కిన్సీ పాత్ర ఏం చేస్తుందనేదే కథ.
కొడుకును వెతుక్కుంటూ వెళ్ళే కిన్సీ పాత్ర
I ఈజ్ ఫర్ ఇన్నోసెంట్: గుర్తు తెలియని వేశ్య హత్య కేసును ఛేధించే క్రమంలో కిన్సీ పాత్రకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయనేదే కథ. ఈ పుస్తకంలో కిన్సీ పాత్రకు నిద్రలేమి (ఇన్సోమ్నియా) అనే జబ్బు ఉంటుంది. P ఈజ్ ఫర్ పెరిల్: చనిపోయిన పోలీసు డిటెక్టివ్ కేసును పరిష్కరించడానికి కిన్సీని నియమిస్తారు. చదువుతున్నంత సేపు ఉత్కంఠను కలుగజేస్తుంది ఈ పుస్తకం. X: ఈ సిరీస్ లో కిన్సీ తన కొడుకును వెతుక్కుంటూ వెళ్తుంది. అలాగే, తన తోటి ఒంటరి మహిళకు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఈ పుస్తకానికి మరో భాగం ఉంటుంది. వై అనే పేరుతో స్యూ గ్రాఫ్టన్ రాసిన ఆల్ఫాబెట్ సిరీస్ లోని ఆఖరి పుస్తకం ఇదే.