Page Loader
Mango Chutney: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆమ్ చట్నీ.. మీరూ ఓసారి ట్రై చేయండి లేకపోతే మిస్‌యిపోతారు!తయారీ విధానం ఇదిగో..
Mango Chutney: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆమ్ చట్నీ..తయారీ విధానం ఇదిగో

Mango Chutney: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆమ్ చట్నీ.. మీరూ ఓసారి ట్రై చేయండి లేకపోతే మిస్‌యిపోతారు!తయారీ విధానం ఇదిగో..

వ్రాసిన వారు Sirish Praharaju
May 16, 2025
02:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి వచ్చిందంటే చాలామందికి ఆకలి మందగిస్తుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో జీర్ణక్రియ మందకొడిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకి భోజనం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. కానీ అదే సమయంలో కొత్తగా, రుచిగా ఏదైనా తినాలనిపించక మానదు. అలా మీకూ అనిపిస్తుంటే, సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న 'ఆమ్ చట్నీ' అనే పచ్చడి వంటకాన్ని మీరు తప్పకుండా ఒకసారి ప్రయత్నించాల్సిందే. ఈ ఆమ్ చట్నీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది రుచి పరంగా అద్భుతంగా ఉండటమే కాకుండా, వేసవిలో నిదానపడే జీర్ణక్రియను మళ్లీ చురుకుగా మార్చేందుకు సహాయపడుతుంది. పచ్చి మామిడికాయలో ఉండే స్వల్ప పులుపు, స్వల్ప తీపి కలసి ఇచ్చే ప్రత్యేకమైన రుచి మీ నాలుకపై ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

వివరాలు 

ఈ చట్నీ తయారీ చాలా ఈజీ!

అంతేకాదు, ఇందులో వాడే మసాలా పదార్థాలు జీర్ణక్రియకు సహకరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. భోజనానంతరం ఈ చట్నీని కొద్దిగా తీసుకుంటే, కడుపు నిండిన భావన కలుగుతుంది. తేలికగా ఉండటంతో పాటు రుచి పరంగానూ బాగుంటుంది. ఇంకా చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ చట్నీ తయారీ చాలా ఈజీ! ఇంట్లో ఉండే కొన్ని సరళమైన పదార్థాలతో నిమిషాలలో సిద్ధం చేసుకోవచ్చు. వేసవి వేడి వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు ఇది ఆరోగ్యంగా, రుచిగా ఉండే వంటకం. ఇక ఆలస్యం ఎందుకు? ఈ ఆమ్ చట్నీ తయారీ విధానాన్ని చూసేద్దాం.

వివరాలు 

అవసరమైన పదార్థాలు: 

నూనె - 3 టేబుల్ స్పూన్లు పచ్చి మామిడికాయ - 1 టమాటాలు - 2 పచ్చిమిర్చి - 2 వెల్లుల్లి రెబ్బలు - 5 ఉప్పు - రుచికి తగినంత చక్కెర - 1 టేబుల్ స్పూన్ మిర్చిపొడి - 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి - 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా - 1/2 టేబుల్ స్పూన్ కొత్తిమీర - అవసరమైనంత తరిగిన ఉల్లిపాయ - 2 టేబుల్ స్పూన్లు

వివరాలు 

తయారీ విధానం: 

ముందుగా పచ్చి మామిడికాయను శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలను కూడా శుభ్రంగా కడిగి, పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని మధ్యలో చీల్చి పెట్టాలి. వెల్లుల్లి రెబ్బలను కొంచెం ముద్దగా నూరుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన పెట్టాలి. పాన్‌లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో మామిడికాయ ముక్కలు వేసి కలపాలి. వెంటనే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి, కలుపుతూ కొద్దిగా వేయించాలి. తరువాత పాన్‌కి మూత పెట్టి, మధ్యం మంటపై 10 నిమిషాల పాటు ఉడికించాలి. మామిడికాయ ముక్కలు మెత్తగా మారే వరకు ఉడకాలి. అన్నీ బాగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

వివరాలు 

సిద్ధంగా ఆమ్ చట్నీ

చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి,అందులో ఉప్పు,చక్కెర,కారం,జీలకర్ర పొడి,గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. కావాలనుకుంటే ఈ చట్నీని రోటి లేదా రోట్లో నూరి మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన చట్నీని ఒక బౌల్‌లోకి తీసుకుని,కావాలనుకుంటే అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు,కొత్తిమీర కలిపి బాగా కలపాలి. (ఉల్లిపాయ కలపడం పూర్తిగా మీ ఇష్టం)తినడానికి సిద్ధంగా ఉన్న ఆమ్ చట్నీ! ఇంతటితో పని అయిపోయింది. చక్కటి రుచితో, ఆరోగ్యంతో కూడిన ఆమ్ చట్నీ రెడీ. వేడి వేడి అన్నంలో కలిపి తింటే రుచి మామూలుగా ఉండదు. అంతేకాదు, చపాతీ, దోస, లేదా ఇడ్లి లాంటి వాటితో కూడా అద్భుతంగా నష్టాలేకుండా తినవచ్చు.