కళ్లకింద నల్లటి వలయాలను తగ్గించడం నుండి నోటి దుర్వాసన పోగొట్టడం వరకు కీరదోస చేసే మేలు
రుతువు మారినప్పుడల్లా శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. అందుకే రుతువు మారుతున్నప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ప్రస్తుతం వేసవి నెమ్మదిగా వచ్చేస్తోంది. ఎండలు పెరిగిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టకుండా చేసే ఎండ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక సమస్యలు వస్తాయి. ఆ సమస్యల నుండి బయటపడడానికి కీరదోస చాలా సాయం చేస్తుంది. అదెలాగో చూద్దాం. శరీరంలో నీరు తగ్గిపోకుండా చూసుకుంటుంది: కీరదోసలో దాదాపు 95శాతం నీరు ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరానికి కావాల్సిన నీరు అందుతుండి. అలాగే శరీరంలోని మలిన పదార్థాలను కీరదోసలో ఉండే పోషకాలు బయటకు పంపివేస్తాయి.
బరువును తగ్గించడంలో కీరదోసకాయ
నోటి దుర్వాసనను దూరం చేస్తుంది: కడుపులోని వేడి కారణంగా నోటి దుర్వాసన వస్తుంది. దీన్నుండి బయట పడాలంటే, ఒక కీరదోస ముక్కను కోసుకుని నోట్లో కొద్దిసేపు ఉంచుకుని తీసేస్తే నోటి దుర్వాసన తగ్గిపోతుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది: కీరదోసకాయ లో ఫైబర్ ఉంటుంది. అలాగే కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో కీర దోసకాయను చేర్చుకోవాల్సిందే. కళ్ళకింద వలయాలను తగ్గిస్తుంది: బ్యూటీషియన్లు కీర దోసను చాలా రకాలుగా ఉపయోగిస్తారు. కళ్లకింద నల్లటి వలయాలు పోవాలన్నా తురిమిన కీరదోసను వలయాల మీద పెట్టుకుంటే సరిపోతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది: కీర దోసలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఉంటుంది కాబట్టి బీపీనే నియంత్రించే శక్తి దీనికి ఉంటుంది.