Work stress: పని ఒత్తిడిని తగ్గించండి.. జీవితాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోండి!
కొచ్చికి చెందిన 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ అనే యువతీ ఇటీవల పనిబారంతో మరణించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె తల్లి స్వయంగా కంపెనీ 'ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా'కి తన కూతురు మరణానికి కారణం పని ఒత్తిడే అని లేఖ రాయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మరవక ముందే లక్నోలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయివేటు బ్యాంకులో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న సదాఫ్ ఫాతిమా విధుల్లోనే కుర్చీలో కూలబడింది. ఆమెకు ఇటీవలే ప్రమోషన్ రావడంతో పని ఒత్తిడి పెరిగిందని పలువురు అంటున్నారు.
హ్యాపీ వర్క్‌ప్లేస్ కోసం పాటించవలసినవి
ఈ వరుస ఘటనలు మంచి పని వాతావరణం ఎంత ముఖ్యమో, ఉద్యోగులకు ఒత్తిడి రాకుండా ఉండటం కూడా అంతే ప్రధానం. మానసిక నిపుణులు పనివేళలో ఎదురయ్యే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో, దాన్ని ఎలా సత్ఫలితంగా హ్యాండిల్ చేయాలో వివరించారు. 1) నో చెప్పడం నేర్చుకోండి ఏ పని మీరు చేయలేనని భావిస్తే, లేదా అది మీ మానసిక స్థితికి మించి ఉందని అనిపిస్తే నిర్ధాక్షిణ్యంగా 'నో' చెప్పడం మంచిది. 2)ప్రాధాన్యతలు నిర్ణయించుకోండి అన్ని పనులను ఒకేసారి చేయాలనే ప్రయత్నం ఒత్తిడికి దారితీస్తుంది. మొదట ప్రాధాన్యత కలిగిన పనులను పూర్తి చేయడం ద్వారా సమయం సద్వినియోగం అవుతుంది.
3)చిన్న విరామాలు తీసుకోండి
నిరంతరాయంగా పని చేయడం కాకుండా ప్రతీ గంట/రెండు గంటలకోసారి పది నిమిషాలు విరామం తీసుకోవడం మనసుకు విశ్రాంతిని ఇస్తుంది. 4) నిద్ర, ఆహారంలో రాజీ పడొద్దు ఒత్తిడిని తగ్గించడానికి సరైన నిద్ర, ఆహారం అవసరం. ఇవి మన ఆరోగ్యానికి అవసరమైన ప్రధానమైనవి. 5) పారదర్శక సంబంధాలు సహోద్యోగులపై అధికారులతో పారదర్శకంగా ఉండటం వల్ల, పనిలో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. 6) యోగా, ధ్యానం యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని నియంత్రించడంలో ఎంతో సహాయపడతాయి. 7) సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగుల ఆరోగ్యం పట్ల సంస్థలు జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో పని ఒత్తిడిని తగ్గించడానికి విశ్రాంతి సమయాలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అవసరం.