రిటైర్మెంట్ ప్లానింగ్: రిటైర్ అవబోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
మరికొన్ని రోజుల్లో రిటైర్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేదంటే రిటైర్ అయ్యాక ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అప్పులు క్లియర్ చేసుకోండి:
రిటైర్ అయ్యే ముందు మీకున్న అన్ని అప్పులు క్లియర్ చేసుకోండి. మార్ట్ గేజ్, హోమ్ లోన్, ఇతర అప్పులేమైనా ఉన్నా క్లియర్ చేయండి. రిటైర్ అయ్యాక ఆదాయం ఉండదు కాబట్టి ఇబ్బంది పడతారు.
ఎమర్జెన్సీ కోసం డబ్బులు దాచుకోండి:
రిటైర్ అయ్యాక మీ దగ్గర కావాల్సినన్ని డబ్బులు ఉంచుకోవాలి. ఏ పరిస్థితి ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఎమర్జెన్సీ కోసం కొంత డబ్బు పక్కన పెట్టుకోండి. ఆ డబ్బును కేవలం ఎమర్జెన్సీ కోసమే వాడండి.
కనీసం మీ చివరి 6నెల జీతాన్ని దీనికోసం కేటాయించండి.
జీవనశైలి
రిటైర్ అవబోయే ముందు చేయాల్సిన పనులు
ఇంటిని బాగు చేసుకోండి:
రిటైర్ అవకముందే మీ ఇంటిని బాగుచేసుకోండి. ఎందుకంటే, ఆ తర్వాత ఆదాయం లేదన్న ఆలోచన మిమ్మల్ని డబ్బు ఖర్చు పెట్టనివ్వకుండా చేస్తుంది. అందుకే రిటైర్మెంట్ కి దగ్గర్లో ఉన్నప్పుడే ఇంటి రిపేర్లు చేయించండి.
అవసరమైనవి ఇప్పుడే కొనండి:
మీకు నచ్చిన వస్తువులను వెంటనే కొనేయండి. ఇన్నిరోజులు నచ్చింది కొనాలా వద్దా అని తెగ ఆలోచించారు. ఇప్పుడలా చేయకండి. మీక్కావాల్సిన టీవీ, స్మార్ట్ ఫోన్ ఇలా ఏదైనా కొనేయండి.
ట్రావెల్ చేయండి:
రిటైర్మెంట్ కి కొంతదూరంలో ఉన్నప్పుడు మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్ళండి. వయసు పెరిగిపోతుంటే పర్యాటకం చేయాలన్న ఉత్సాహం తగ్గిపోతుంది. ఉత్సాహం ఉన్నా కూడా ఓపిక ఉండదు. కాబట్టి నచ్చిన ప్రాంతాల్లో పర్యటించండి.