LOADING...
Mushroom Allergy: పుట్టగొడుగుల వల్ల అలెర్జీ ప్రమాదం.. ఎవరు తినకూడదంటే?
పుట్టగొడుగుల వల్ల అలెర్జీ ప్రమాదం.. ఎవరు తినకూడదంటే?

Mushroom Allergy: పుట్టగొడుగుల వల్ల అలెర్జీ ప్రమాదం.. ఎవరు తినకూడదంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 24, 2026
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని సాధారణంగా అందరూ భావిస్తారు. అందుకే ఎక్కువ ధర ఉన్నప్పటికీ చాలా మంది వారంలో ఒక్కసారైనా వాటిని ఆహారంలో చేర్చేందుకు ప్రయత్నిస్తుంటారు. రుచితో పాటు పుష్కలమైన ప్రోటీన్లు, విటమిన్లు ఉండటంతో పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివేనని వైద్యులు కూడా సూచిస్తుంటారు. పుట్టగొడుగు సూప్‌, స్టిర్‌ ఫ్రై, పిజ్జా, సలాడ్‌ వంటి అనేక రకాలుగా వీటిని వండుకుని ఆస్వాదిస్తుంటారు. అయితే కొందరికి మాత్రం పుట్టగొడుగులు సరిపోవు. తమకు అలెర్జీ ఉందంటూ పూర్తిగా దూరంగా ఉంటారు. ఇంత పోషక విలువలున్న పుట్టగొడుగులు కొంతమందికి ఎందుకు అలెర్జీని కలిగిస్తున్నాయి? వారు తప్పనిసరిగా వాటిని మానుకోవాలా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Details

పుట్టగొడుగులు అలెర్జీని ఎందుకు కలిగిస్తాయి?

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొంతమందికి పుట్టగొడుగుల అలెర్జీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ముందుగా ఉన్న ఆహార అలెర్జీలు, పుప్పొడి అలెర్జీలు ఉన్నవారు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వారు లేదా సున్నితమైన చర్మం ఉన్నవారు పుట్టగొడుగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. NCIB పరిశోధనల ప్రకారం.. పుట్టగొడుగుల్లో ఉండే కొన్ని ప్రోటీన్లు బూజు (మోల్డ్) అలెర్జీ కారకాలతో పరస్పర చర్యకు దిగుతాయి. దీని వల్ల సున్నితమైన వ్యక్తుల్లో అలెర్జీ ప్రతిచర్యలు ఏర్పడతాయి. పుట్టగొడుగులు తిన్నప్పుడు, వారి రోగనిరోధక వ్యవస్థ ఈ ప్రోటీన్లను హానికరమైన పదార్థాలుగా తప్పుగా గుర్తించి అలెర్జీని ప్రేరేపిస్తుంది. ఫలితంగా హిస్టామిన్‌ సహా ఇతర రసాయనాలు విడుదలై దురద,చర్మంపై దద్దుర్లు, వాపు, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులొస్తాయి.

Details

ఏ పుట్టగొడుగులు ఎక్కువ హానికరం?

పండించిన పుట్టగొడుగులే కాకుండా అడవి పుట్టగొడుగుల్లో కూడా అలెర్జీకి కారణమయ్యే ప్రోటీన్లు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే అడవి పుట్టగొడుగుల్లో ఇవి ఎక్కువ మోతాదులో ఉండే అవకాశముంది. అలాగే కొంతమందిలో క్రాస్‌ అలెర్జీలు కూడా వస్తాయి. ఇప్పటికే పుప్పొడి అలెర్జీల చరిత్ర ఉన్నవారికి పుట్టగొడుగుల వల్ల కూడా అలెర్జీ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.

Advertisement

Details

పుట్టగొడుగులకు ఎవరు దూరంగా ఉండాలి?

అలెర్జీలు ఉన్నవారు పుట్టగొడుగులు లేదా ఇతర శిలీంధ్ర ఉత్పత్తులకు అలెర్జీ చరిత్ర ఉన్నవారు వీటిని తీసుకోకుండా ఉండాలి. వీటివల్ల చర్మ దద్దుర్లు, దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారు మధుమేహం లేదా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారిలో పుట్టగొడుగుల్లోని ఫంగల్‌ ప్రోటీన్లు ఇన్ఫెక్షన్లు లేదా అలెర్జీ ప్రతిచర్యలను మరింత పెంచుతాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారు మలబద్ధకం, గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువగా పుట్టగొడుగులు తింటే ఉబ్బరం, గ్యాస్‌, జీర్ణ సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది.

Advertisement

Details

గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలు

గర్భధారణ సమయంలో లేదా పాలిచ్చే దశలో పుట్టగొడుగులు తీసుకోవడం మానుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా పుట్టగొడుగులు ఆరోగ్యకరమైన ఆహారమే అయినప్పటికీ, శరీర స్వభావాన్ని బట్టి కొందరికి అవి హానికరంగా మారవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అలెర్జీ లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.

Advertisement