
Valentine's Week Road Trips: ప్రేమికుల రోజున లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకునేవారికి.. ఇవి బెస్ట్ రోడ్ వేలు
ఈ వార్తాకథనం ఏంటి
లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టపడని అమ్మాయి ఉండదు. చాలా మంది తమ స్నేహితులతో లేదా తమ ప్రియమైన వారితో కలిసి సరదాగా లాంగ్ డ్రైవ్ వెళ్లిపోతుంటారు, ఇది మీకు తెలిసిన విషయమే.
ఇప్పుడు ప్రేమికుల వారం (Valentine's Week 2023) మొదలవుతోంది.
మరి మీకు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని లేదా జీవిత భాగస్వామిని ఈ ప్రేమికుల రోజున (Valentine's Day 2023) అద్భుతమైన బహుమతిని ఇవ్వాలనుకుంటున్నారా? మీరు ఇద్దరూ కలిసి అద్భుతమైన క్షణాలను ఆస్వాదించేందుకు కొన్ని రొమాంటిక్ రోడ్ ట్రిప్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోడ్ ట్రిప్ మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తుంది.
వివరాలు
Valentine's Week Romantic Road Trips- ప్రేమికుల రోజు కోసం రొమాంటిక్ రోడ్ ట్రిప్‌లు
మీ ప్రేమికుల రోజును మరింత ప్రత్యేకంగా చేయడానికి, సుందరమైన దృశ్యాలతో నిండిన భారతదేశంలోని 5 అద్భుతమైన రోడ్‌వేలు..
బెంగళూరు నుండి బందీపూర్ ఫారెస్ట్
బెంగళూరు నుండి బందీపూర్ ఫారెస్ట్‌కు 217 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రోడ్ ట్రిప్ మీకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది.
మార్గంలో మీరు పచ్చని చెట్లు, ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు.
అడవుల్లో ప్రయాణించేప్పుడు కొన్నిసార్లు అరుదైన వన్యప్రాణులను కూడా చూడవచ్చు.
కబిని నదిలో బోటు షికారు చేయడం, మోయార్ కాన్యన్ సందర్శించడం వంటి ప్రత్యేక అనుభవాలు పొందవచ్చు.
వివరాలు
ముంబై నుండి కాషిద్
గోవా, అలీబాగ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను కలిపే ఈ మార్గం రోడ్ ట్రిప్‌లకు అద్భుతమైనది.
ముంబై నుంచి కాషిద్‌కు 129 కిలోమీటర్లు, అంటే నాలుగు గంటల ప్రయాణం.
ఈ ట్రిప్‌లో కొంకణ్ ప్రాంతం పచ్చని ప్రకృతి, అందమైన బీచ్‌లు, కాషిద్ పట్టణంలో ఉన్న నిర్మలమైన బీచ్, వాటర్‌స్పోర్ట్స్‌ను ఆస్వాదించే అవకాశం, బీచ్‌పై అలలను చూసే అనుభవం ఉంటుంది. తీరంపై గుర్రపు స్వారీ కూడా చేయవచ్చు.
వివరాలు
చెన్నై నుండి మున్నార్
గంభీరమైన కొండలు, ప్రకృతి అందాలు, పెద్ద వృక్షాలు,తేయాకు తోటలు,సహజ జలపాతాలు - ఇవన్నీ చెన్నై నుండి మున్నార్ వరకు ప్రయాణిస్తే మీరు చూసే అద్భుతమైన దృశ్యాలు. ఈ ప్రయాణం రొమాంటిక్ గా ఉంటుంది. చెన్నై నుంచి మున్నార్ దాదాపు 592 కిలోమీటర్ల దూరం.ఈ మార్గంలో లక్కం జలపాతాలు, మట్టుపెట్టి ఆనకట్ట,చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యం,చినార్ వాచ్ టవర్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.
సిమ్లా నుండి మనాలి
హిమాలయాల చక్కటి దృశ్యాలతో సిమ్లా నుండి మనాలి వరకు ఈ రోడ్ ట్రిప్ ఎంతో ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది.
ఇది అత్యంత సుందరమైన రహదారిలో ఒకటి. 220 కిలోమీటర్ల దూరం. ప్రయాణంలో చల్లని గాలులు మిమ్మల్ని తాకుతుంటాయి, మార్గంలో వుండే వేడివేడి రుచులు మీకు స్వాగతం పలుకుతుంటాయి.
వివరాలు
జైపూర్ నుండి జైసల్మేర్
ఎక్కడైనా కాసేపు ఆగి రిఫ్రెష్ కావచ్చు. చల్లని బియాస్ నది వద్ద ఆడలాడడం మరిచిపోవద్దు.
ఒక వైపు రాజభవనాలు, మరొక వైపు ఎడారి. ఈ రాయల్ టూర్ చేయాలనుకుంటే జైపూర్ నుండి జైసల్మేర్ వరకు 500 కిలోమీటర్ల ప్రయాణం చేయండి.
మీ ప్రయాణంలో జైసల్మేర్ కోట, గడిసర్ సరస్సు, తనోత్ మాతా దేవాలయాన్ని చూడవచ్చు.
రాజస్థాన్ గ్రామీణ జీవితం, స్థానిక సంప్రదాయాలను తెలుసుకోవచ్చు. ప్రసిద్ధ రాజస్థానీ వంటకాలను రుచిచూడవచ్చు.