Loading...
Saddula Batukamma Prasadam: సద్దుల బతుకమ్మ వచ్చిందంటే మలీదా లడ్డూలు, నువ్వుల సద్ది నైవేద్యాలుగా ఉండాల్సిందే.. వీటి రెసిపీలు ఇవిగో
సద్దుల బతుకమ్మ వచ్చిందంటే మలీదా లడ్డూలు, నువ్వుల సద్ది నైవేద్యాలుగా ఉండాల్సిందే

Saddula Batukamma Prasadam: సద్దుల బతుకమ్మ వచ్చిందంటే మలీదా లడ్డూలు, నువ్వుల సద్ది నైవేద్యాలుగా ఉండాల్సిందే.. వీటి రెసిపీలు ఇవిగో

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2024
09:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో అత్యంత ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ఈ పండుగను ముఖ్యంగా ఆడపడుచులు జరుపుకుంటారు. వారు అందమైన చీరల్లో, పూలతో అలంకరించిన బతుకమ్మను కట్టుకుని, మహిళలు ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. పూలతో సాగే ఈ పండుగ తెలంగాణ రాష్ట్రంలోని వీధులు, వాడలు, గ్రామాలను రంగురంగుల పువ్వులతో అందంగా మార్చేస్తుంది. ఈ వేడుకలో మహిళలు తమ కుటుంబానికి, ప్రకృతికి మేలు కోరుతూ బతుకమ్మను నైవేద్యాలు సమర్పిస్తారు. సద్దుల బతుకమ్మ: తొమ్మిది రోజులు పాటు జరిపే ఈ పండుగలో చివరి రోజు "సద్దుల బతుకమ్మ" ప్రధానమైనది. ఈ రోజున ప్రత్యేకంగా "మలీదా లడ్డూ" "నువ్వుల సద్ది" నైవేద్యంగా సమర్పిస్తారు. ఇవి తయారు చేయడం చాలా సులువు.

వివరాలు 

మలీదా లడ్డూ రెసిపీ 

కావాల్సిన పదార్థాలు:

బొంబాయి రవ్వ - అరకప్పు

గోధుమపిండి - ఒక కప్పు

జీడిపప్పు, బాదం, పిస్తా - కలిపి గుప్పెడు

పాలు - అరకప్పు

యాలకుల పొడి - ఒక స్పూను

సోంపు పొడి - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

బెల్లం తురుము - ఒక కప్పు

వివరాలు 

మలీదా లడ్డూ తయారీ విధానం

ఒక గిన్నెలో గోధుమపిండిని,రవ్వను వేసి కలపాలి. అందులో కాచిన నెయ్యి వేసి బాగా కలిపి,పాలు వేసి చపాతీ పిండిలా చేయాలి.

పావుగంట సేపు పక్కన పెట్టి,ఆ పిండిని చపాతీల్లా ఒత్తి కాల్చుకోవాలి.ఇప్పుడు చపాతీలను చిన్న ముక్కలుగా చేసి,మిక్సీలో రుబ్బాలి.

గిన్నెలో ఈ పొడిని,బెల్లం తురుమును కలపాలి.కాచిన నెయ్యిలో జీడిపప్పు,బాదం,పిస్తాలను వేయించి, యాలకుల పొడితో కలపాలి.

ఈ మిశ్రమంతో లడ్డూలు చేయాలి.

ADVERTISEMENT

వివరాలు 

నువ్వుల సద్ది రెసిపీ 

కావాల్సిన పదార్థాలు:

వండిన అన్నం - మూడు కప్పులు

ఎండుమిర్చి - నాలుగు

నువ్వులు - అరకప్పు

శెనగపప్పు - ఒక స్పూను

ఆవాలు, జీలకర్ర - ఒక్కొక్క స్పూను

పసుపు - అర స్పూను

నూనె - మూడు స్పూన్లు

ధనియాలు - రెండు స్పూన్లు

మెంతులు - అర స్పూను

కరివేపాకు - గుప్పెడు

ADVERTISEMENT

వివరాలు 

నువ్వుల సద్ది తయారీ విధానం

ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు, మెంతులు వేయించి పొడి చేయాలి.

అన్నాన్ని ముందుగానే వండి ఆరబెట్టుకోవాలి.

స్టవ్ మీద నూనె వేడి చేసి, ఎండు మిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు వేసి చిటపటలాడించాలి.

పసుపు వేసి, వండిన అన్నం, ఉప్పు కలపాలి.

నువ్వుల పొడిని వేసి బాగా కలిపి, సద్దిని సమర్పించాలి.

సద్దుల బతుకమ్మలో మలీదా లడ్డూ ,నువ్వుల సద్దిని తప్పనిసరిగా సమర్పించడం ఆనవాయితీ.

ADVERTISEMENT