
Sankranthi Muggu: సంక్రాంతి ముగ్గుల వెనుక ఉన్న పురాణ చరిత్ర ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
Sankranthi: తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే పెద్ద పండగల్లో సంక్రాంతి ఒకటి.
ముఖ్యంగా తెలంగాణ కంటే.. ఏపీలో ఈ పండగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
సాధారణంగా సంక్రాంతి అనేగానే భోగి మంటలు, ఇంటి వాకిళ్లో రంగురంగుల ముగ్గులు, బసవన్నల సందళ్లు, కోడి పందాలు మనకు గుర్తొస్తాయి.
మూడు రోజుల పాటు జరుపుకునే ఈ వేడుక.. భోగీతో ప్రారంభమై.. కనుమతో ముగుస్తుంది.
సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి వాకిళ్లు రంగురంగుల ముగ్గులతో నిండిపోతాయి.
ఈ ముగ్గులు వేయడం అనేది సరదా కోసమే.. లేక మహిళలు తమ క్రియేటివిటీని చూపించడం కోసమో కాదట.
సంక్రాంతి పర్వదినాన ముగ్గులు వేయడం వెనుక ఒక కథ ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి
ముగ్గులు వేస్తే ఏం జరుగుతుంది?
సంక్రాంతి పర్వదినాన ఇంటి లోగిళ్లలో వేసే ముగ్గుకు చాలా ప్రత్యేక ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.
సంక్రాంతి వేళ.. ఎవరి ఇంటి ముందు ముగ్గులు ఉంటాయో వారికి ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అంటుంటారు.
ఈ పండగ రోజుల్లో సాక్షాత్తు లక్ష్మీదేవి వీధుల్లోకి ప్రజలు నమ్ముతారు.
అందుకే సంక్రాంతి జరుపుకునే మూడు రోజుల్లో ఎవరైతే ఇళ్ల ముందు కల్లాపి చల్లి, ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెడతారో వారిని లక్ష్మీదేవి కటాక్షిస్తుందట.
అంతేకాకుండా, చేయడం వల్ల ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలను కూడా లక్ష్మీదేవి ప్రసాదిస్తుందని నమ్మకం కూడా ప్రజల్లో ఉంది.
అందుకే.. సంక్రాంతి వేళ.. అన్ని లోగిళ్లు రంగవళ్లులు, గొబ్బెమ్మలతో నిండిపోతాయి.