Sankranti Recipe: సంక్రాంతి ప్రత్యేకం.. చెరుకు రసంతో టెస్టీ జంతికలు ఎలా తయారు చేయాలంటే!
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండుగ అంటే జంతికలు, అరిసెలు, సున్నుండలు, సకినాలు వంటివి మనకు గుర్తుకువస్తాయి. వాటిలో ప్రత్యేకంగా తీపి జంతికలు (తీపి మురుకులు)ను పరిచయం చేస్తాం.
ఈ తీపి జంతికలు చెరుకు రసంతో తయారుచేయడం వల్ల వాటి రుచి అద్భుతంగా ఉంటుంది.
పిల్లలకు కూడా ఇవి బాగా నచ్చుతాయి. కారం జంతికలు తినడం ఇష్టపడని వారికి ఈ తీపి జంతికలు ఒక మంచి ఆప్షన్ అవుతాయి.
సంక్రాంతి పండుగలో వాటిని కుటుంబ సభ్యులకు, అతిథులకు వడ్డించడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి ఇస్తుంది.
Details
తీపి జంతికలు రెసిపీ కోసం కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి - 1 కప్పు
డీప్ ఫ్రై చేయడానికి నూనె నువ్వులు,
ఉప్పు
బటర్ చెరుకు రసం
తీపి జంతికలు రెసిపీ
1.ముందుగా ఒక గిన్నెలో బియ్యప్పిండి తీసుకోండి.
2.అందులో నువ్వులు, ఉప్పు, బటర్ వేసి బాగా కలపండి.
3.తర్వాత చెరుకు రసాన్ని చిన్న భాగాలుగా వేసి, చపాతీ పిండిని తయారుచేసుకోండి.
4.ఈ పిండి పలుచగా కాకుండా, మందంగా కాకుండా ఉండాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద, డీప్ ఫ్రై చేసేందుకు సరిపడా నూనె వేసి, వేడి చేయండి.
6. మురుకుల గొట్టంలో పిండిని జాగ్రత్తగా పెట్టి, నూనెలో వేయండి.
7. రెండు వైపులా రంగు మారే వరకు ఫ్రై చేయండి.
8. తయారైన తీపి జంతికలను తీసి, పక్కన పెట్టుకోండి.
Details
పిల్లలు ఇష్టంగా తింటారు
ఇలా మీరు చెరుకు రసంతో చేసుకున్న ఈ తీపి జంతికలు కొత్తగా రుచిగా ఉంటాయి. చిన్న పిల్లలు ఇష్టంగా తినగలుగుతారు.
ఈ రెసిపీని మీరు ఎంచుకోవడం వల్ల పంచదారపాకం కన్నా ఆరోగ్యపరమైన చెరుకు రసం ఉపయోగిస్తారు. ఇది మన శరీరానికి కూడా ప్రయోజనకరం.
ఒకసారి మీరు ఈ చెరుకు రసంతో జంతికలు చేసుకుని చూడండి. అది మీకు ఎంతో నచ్చుతుందని నమ్మకంగా చెప్పొచ్చు.