Page Loader
ఆడపిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే తల్లిదండ్రులు చెప్పే మాటలు
ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే మాటలు

ఆడపిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే తల్లిదండ్రులు చెప్పే మాటలు

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 16, 2023
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆడపిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఆ జాగ్రత్త కొన్ని కొన్ని సార్లు అతి జాగ్రత్తగా మారిపోతూ ఉంటుంది అలాంటి టైం లోనే కొన్ని జాగ్రత్తలు ఆడపిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. ఈ పని ఆడవాళ్లకు కాదు ఒక పని చేసే విషయంలో ఆడా మగా అన్న తేడా చూపించడం ఇప్పటికైనా మానుకోండి. మారుతున్న ప్రస్తుత కాలంలో ఏ పనైనా ఎవరైనా చేయగలరని విషయం మీరు గుర్తుంచుకోండి. వంట నేర్చుకో, పెళ్లయిన తర్వాత ఇంకేం చేస్తావ్ కేవలం పెళ్లి కోసమే వంట నేర్చుకోమని చెప్పడం కరెక్ట్ కాదు. మనం బ్రతకాలంటే తినాలి కాబట్టి వంట నేర్చుకోవాలి. అంతేకానీ ఎవర్నో మెప్పించి వంటింట్లో ఉండడానికి కాదు.

జీవన శైలి

ఆడపిల్లలకు తల్లిదండ్రులు చెప్పకూడని కొన్ని మాటలు

ఆడపిల్లలు అరవకూడదు తమ వైపు సరైన వాదన ఉన్నా కూడా ఆడవాళ్లు అరవకూడదని, అవతలి వాళ్ళ ముందు నిదానంగా ఉండాలని చాలామంది చెబుతారు. దానివల్ల తమకు నచ్చినదేదో ఆడవాళ్లకు తెలియకుండా పోతుంది. ఇక్కడ అరవడం అంటే తమ వాదన వినిపించడం అని అర్థం. ఆడపిల్లలు ఇంటికి ఆలస్యంగా రాకూడదు భద్రతా కారణాలవల్ల ఆడపిల్లలు తొందరగా ఇంటికి రావాలని చెబుతారు. అది నిజమే, కానీ కేవలం ఆడపిల్లలన్న కారణంగా ఇంటికి తొందరగా రావాలని చెప్పడం మాత్రం తప్పు. దానికన్నా ముందుగా బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆడపిల్లలకు వివరించాలి. అప్పుడు మీ భయం వాళ్లకు అర్థమవుతుంది. నీకు రిచ్ పర్సన్ తో పెళ్లి చేస్తాము ఆడపిల్లలను తమ కాళ్ళ మీద నిలబడేలా తయారు చేయండి.