LOADING...
Tiny Robots: అత్యాధునిక మైక్రో రోబోట్లు రక్తనాళాల్లో ప్రయాణించి బ్రెయిన్ స్ట్రోక్ను నిమిషాల్లో నివారిస్తాయి..! 
అత్యాధునిక మైక్రో రోబోట్లు రక్తనాళాల్లో ప్రయాణించి బ్రెయిన్ స్ట్రోక్ను నిమిషాల్లో నివారిస్తాయి..!

Tiny Robots: అత్యాధునిక మైక్రో రోబోట్లు రక్తనాళాల్లో ప్రయాణించి బ్రెయిన్ స్ట్రోక్ను నిమిషాల్లో నివారిస్తాయి..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2025
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రాణాంతకంగా మారే ఆరోగ్య సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. ఈ పరిస్థితి తలెత్తిన వెంటనే రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స ప్రారంభించడం అత్యంత అవసరం. కొద్దిసేపు ఆలస్యం జరిగినా ప్రాణాపాయం తప్పదు. ఇదే సమస్యను భవిష్యత్తులో నివారించేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు కీలక పరిష్కారాన్ని కనుగొన్నారు. వారు రక్తనాళాల్లో ప్రయాణించి, మెదడులో గడ్డ కట్టిన ప్రాంతాన్ని చేరుకొని స్ట్రోక్‌ను అడ్డుకునే మైక్రో రోబోట్లను రూపొందించారు. ఇవి చేతి లేదా తొడ భాగం వద్ద చిన్న సూదితో రక్తంలోకి ఇంజెక్ట్ చేయబడతాయి. రక్తప్రవాహంతో ప్రయాణిస్తూ ఇవి మెదడు వరకు చేరి, గడ్డను నేరుగా పగలగొట్టి కొన్ని నిమిషాల్లోనే రక్తప్రసరణను పునఃప్రారంభిస్తాయి.

వివరాలు 

రియల్ టైమ్‌లో నావిగేట్ అవుతూ గడ్డకట్టిన రక్తాన్ని సమర్థవంతంగా తొలగించగలదు 

స్ట్రోక్ వచ్చిన ప్రతి నిమిషం అతి ముఖ్యమైనది.చికిత్స ఆలస్యమైతే మెదడు కణాలు వేగంగా నశిస్తాయి. కానీ కొత్తగా అభివృద్ధి చేసిన ఈ మైక్రో రోబోట్లు చికిత్సలో'గోల్డెన్ అవర్'అనే భావనను దాదాపు వెంటనే స్పందించే స్థాయికి తీసుకెళ్తాయని నిపుణులు అంటున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో స్ట్రోక్ రాగానే వెంటనే ప్రత్యేక సౌకర్యాలున్న ఆసుపత్రికి తరలించి,క్యాథెటర్ లేదా శస్త్రచికిత్సతో గడ్డను తొలగించాల్సి ఉంటుంది. దీనికి గంటల సమయం పట్టడం సహజం. కానీ ఈ మైక్రో రోబోట్లు రక్తనాళాల్లోని అతిసన్నని ప్రాంతాల వరకూ చేరి,క్యాథెటర్ చేరలేని చోట్ల కూడా గడ్డను తొలగించగలవు. దీంతో మరణ ప్రమాదం గణనీయంగా తగ్గవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రారంభ పరీక్షల్లోనూ ఇవి రియల్ టైమ్‌లో నావిగేట్ అవుతూ గడ్డకట్టిన రక్తాన్ని సమర్థవంతంగా తొలగించగలవని తేలింది.

వివరాలు 

ప్రపంచ వైద్యరంగానికి ఇది ఒక గొప్ప ముందడుగు

ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలో ఈ మైక్రో రోబోట్లు కీలక పాత్ర పోషించనుండటం ఖాయం. అంతేకాకుండా అంబులెన్స్‌లలో, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో, హైవేలు వంటి ప్రాంతాల్లో పోర్టబుల్ స్ట్రోక్ యూనిట్లలో వీటిని అందుబాటులో ఉంచడం ద్వారా స్ట్రోక్ వల్ల జరిగే మరణాలను భారీగా తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వైద్యరంగానికి ఇది ఒక గొప్ప ముందడుగుగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.

Advertisement